సత్తుపల్లిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు జరిగాయి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య. జయంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణ గౌడ్ సంఘం బాధ్యులకు సత్తుపల్లి పట్టణంలో స్థలంతో పాటు 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంజూరు పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. అన్నివర్గాలను కలుపుకొని అప్పటి నియంతృత్వ, నిరంకుశ శక్తులను వ్యతిరేకిస్తూ పాపన్న గౌడ్ పోరాడారని సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సత్తుపల్లి పట్నంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలు ఘటించి నివాళులర్పించారు.
కల్లుగీత కార్మికుల వేషధారణతో గౌడ సోదరులు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి ఘన స్వాగతం పలకగా, సత్తుపల్లి పట్టణంలో 50 లక్షల రూపాయలతో నూతనంగా గౌడ కులస్తుల కొరకు నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భావన నిర్మాణ మంజూరు పత్రాన్ని గౌడ సంఘం బాధ్యులకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అందజేసి వారికి పాపన్న గౌడ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. ఆ పథకాల ఫలాలు అందరికీ అందాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. దీంతో అక్కడున్న వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ చైర్మన్ వనమా వాసు, కౌన్సిలర్లు మట్ట ప్రసాద్, చింతలపాటి వెంకటేశ్వరరావు, చిట్టిబొమ్మ రామకృష్ణ, ఈడ నాగేశ్వరరావు, ఈడా రాఘవరావు, కంటే అప్పారావు, పులిచర్ల రామకృష్ణ, చిల్లపల్లి మాధవ, మిద్దె శ్రీను, మిద్దె రామకృష్ణ, పామర్తి నాగేశ్వరరావు, రేఖల విజయ కుమార్, రాజులపాటి మోహన్ రావు, ఈడా శ్రీనివాసరావు, మిద్దె రామకృష్ణ, మరీదు రాము, అర్వపల్లి సందీప్, శొంఠి రాము, హరి, అర్జునరావు తదితరులున్నారు.