Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Chevella: అంబేద్కర్ నడయాడిన నేల పంచ రత్నాలు

Chevella: అంబేద్కర్ నడయాడిన నేల పంచ రత్నాలు

అసెంబ్లీ బూత్ మేళా కార్యక్రమం

చేవెళ్ళ నియోజకవర్గ కేంద్రంలో బిజెపి సిహెచ్ఆర్ గార్డెన్ లో అసెంబ్లీ స్థాయి బూత్ మేళా కార్యక్రమాన్ని కార్యకర్తలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కల్వకుంట్ల అవినీతి కుటుంబం గద్దెదించాలి. కాంగ్రెస్ పార్టీ 10 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది. రాష్ట్ర ప్రజలు నియంత పాలనకు చరమగీతం పాడాలంటుండ్రు. రుణమాఫీ పేరుతో రైతులను ప్రభుత్వ భూములు అమ్మి సంక్షేమ పథకాలు అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుండన్నారు. దళిత బంధులో టిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చుకొని 30 శాంతం కమీషన్లు దండుకొంటున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కాం నుండి పబ్లిక్ దృష్టి మల్లించేందుకు మహిళా రిజర్వేషన్ బిళ్ళంటు డ్రామా చేశారన్నారు. ఉద్యోగులు వేయక స్టూడెంట్స్ రోడ్డున పడ్డారన్నారు. పావుల వడ్డీ బీసీ బంద్ పేరుతో మహిళాను బీసీలను మోసం చేశారన్నారు. విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నిదులివ్వక కల తప్పినయన్నారు. దేశంలోనే అత్యంత అవినీతికి పార్టీ బిఆర్ఎస్ అని కాంగ్రెస్ మజిలీస్ కలిసి ప్రజలను దోచుకుంటుండ్రన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టి ఆయనకు భారతరత్నంతో పురస్కారించింది బిజెపి అన్నారు.

- Advertisement -

బండి సంజయ్ మాట్లాడుతూ…
అంబేద్కర్ నడయాడిన నేలను మోడీ పంచ రత్నాలుగా తీర్చిదిద్దారన్నారు. కెసిఆర్ క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యక్తి అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం విజయశాంతి, సుష్మ స్వరాజ్ పార్లమెంట్లో పోరాడారన్నారు. కాంగ్రెస్ పార్టీ పోడు భూముల కోసం ఈనాడు పోరాడలేదని బిఆర్ఎస్ భూముల పట్టాలు ఓట్ల కోసమే అన్నారు. 317 జి ఒ బిజెపి పార్టీ పోరాడితే ప్రభుత్వం దిగొచ్చిందని తద్వారా ఉపాధ్యాయ ఎన్నికల్లో బిజెపి గెలిచిందన్నారు. 57శాంతం ఉన్న బీసీలకు 23 సీట్లిచ్చి వారికీ అన్యాయం చేశారన్నారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మెందుకు ఎంఐఎంతో కలిశారని ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలనే గవర్నర్ ఆలోచన అన్నారు. పాతబస్తీ బిజెపి అడ్డాఅన్నారు. పాతబస్తీ అంటే చార్మినార్ కాదని భాగ్యలక్ష్మి మాత టెంపుల్ అన్నారు.


ఈ కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్యే చంద్రప్ప, జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, వీరేందర్ గౌడ్ కంజుర్ల ప్రకాష్, మండల అధ్యక్షులు పాండురంగారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి అత్తేల్లి అనంతరెడ్డి కొప్పు భాషా, వర్రీ తులసి రామ్ విజయ్ కుమార్, పత్తి సత్యనారాయణ విటల్, రమేష్ ప్రతాప్ రెడ్డి, వెంకట్ రెడ్డి పాండురంగ రెడ్డి అనంతరెడ్డి కేశపల్లి వెంకటరాం రెడ్డి, కృష్ణ గౌడ్, పత్తి సత్యనారాయణ అశోక్ శ్రీనివాస్ యాదవ్ ప్రవీణ్ రెడ్డి కృష్ణమోహన్ శేఖర్ రెడ్డి, అభిలాష్ రంజిత్ అభిషేక్ మహేందర్ మల్ రెడ్డి కొంచెం శీను వివిధ బూత్ కమిటీల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News