Sunday, November 10, 2024
Homeపాలిటిక్స్Chevella: 'ప్రజా గర్జన' సభను విజయవంతం చేయండి

Chevella: ‘ప్రజా గర్జన’ సభను విజయవంతం చేయండి

సభ ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కు రెడీ

చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో ఆగస్టు 26న జరగనున్న కాంగ్రెస్ ప్రజా గర్జన సభ ఏర్పాట్లను ఏఐసీసీ సెక్రెటరీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏఐసీసీ కార్యదర్శులు స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్టం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ హైదరాబాదులో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ చేశారని ఆగస్టు 26న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయనున్నారన్నారు. ఈ సభ చరిత్రత్మకమైనదన్నారు. కెసిఆర్ కుటుంబం అవినీతితో కూరుకుపోయిందన్నారు. లిక్కర్ స్కాంలో తన కూతురు ఉందని ఇదే స్కీమ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారన్నారు. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులలో భారీ అవినీతి జరిగిందన్నారు. కెసిఆర్ ప్రజలను ఎంత ప్రలోభ పెట్టిన ఎంత డబ్బు పంచినా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఉందన్నారు. చేవెళ్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి అనుబంధం విడదీయలేనిదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన ప్రజలకు సత్ఫలితాల ప్రయోజనాలను చేకూర్చిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ సి, ఎస్ టి సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించి దోచుకుంటున్నారన్నారు. గిరిజనులకు లక్షల ఎకరాలు పోడు భూములను కాంగ్రెస్ పార్టీ ఇస్తే టిఆర్ఎస్ నాయకులు అటవీశాఖ అధికారులతో కలిసి గిరిజనులపై దాడులు చేసి భూములను కబ్జా చేసే పరిస్థితిలు రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లాలో పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ భూములను పంచిపెడితే ప్రజల భూములను లాక్కొని అరకొరకగా వారికి 10,20 లక్షలు ఇచ్చి ప్రైవేట్ కంపెనీలకు కోట్లకు అమ్ముకుంటున్నారన్నారు. 50 శాతం ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని ముదిరాజులకు ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కెసిఆర్ బిసి సామాజిక వర్గానికి 15 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి బీసీలను అవమానపరిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని 10 సంవత్సరాలుగా మాదిగలను మోసం చేస్తున్నారన్నారు. రాజయ్యకు మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ పదవి నుంచి తొలగించి నేడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం మాలలను అవమానించినట్టేనని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూములు అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ ప్రాజెక్టుగా నామకరణం చేసి ఉమ్మడి జిల్లాలకు నీళ్లు అందిస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మెదక్ జిల్లాకు రంగనాయకి ప్రాజెక్టుకు నీళ్లు మళ్లించారని జిల్లాకు చుక్క నీరు ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను నిరుద్యోగులను అమరవీరుల కుటుంబాలను మోసం చేశారని బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుతో కేసీఆర్ ను ఓడించి సోనియమ్మ కలలుగన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని కోరారు 26 తేదీన జరిగే ప్రజా గర్జన సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేస్తున్నందున లక్షలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు విశ్వనాధ్ పిసిసి ఉపాధ్యక్షులు వేము నరేందర్ ఏఐసీసీ సెక్రెటరీ మన్సూర్ అలీ ఖాన్ ఎమ్మెల్యే కెఎల్ఆర్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పిసిసి అధికార ప్రతినిధి గౌరి సతీష్ పీసీసీ అధికార ప్రతినిధి ఎలువంటి మధుసూదన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్లా నర్సింహారెడ్డి మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి చింపుల సత్యనారాయణ వేం ప్రశాంత్ రెడ్డి ఉదయ మోహన్ రెడ్డి మండలాల అధ్యక్షులు చంద్రశేఖర్ వెంకటయ్య పెంట రెడ్డి సీనియర్ నాయకులు సున్నపు వసంతం షాబాద్ దర్శన్ వెంకటస్వామి చేవెళ్ల సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి మహిళా మండల అధ్యక్షులు సమతా వెంకటరెడ్డి యాలల మహేశ్వర్ రెడ్డి గోనె ప్రతాప్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ జుకనగాడి శ్రీకాంత్ రెడ్డి మద్దెల శ్రీను భార్గవ్ రామ్ చాంద్ పాషా అనిప్ భాయ్ హరికృష్ణ సురేష్ దేవేందర్ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News