Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: చక్కెర ఫ్యాక్టరీ కోసం బోనం సమర్పించిన చెన్నమనేని

Mallapur: చక్కెర ఫ్యాక్టరీ కోసం బోనం సమర్పించిన చెన్నమనేని

చక్కెర ఫ్యాక్టరీ కోసం పోరాటం

ముత్యంపేట్ లోని మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని గత ఏడాది ఇదే రోజు వేలాదిమంది చెరుకు రైతులతో పెద్దెత్తున యాటలు కోసి బోనాలు తీసిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా ఈరోజుకు సంవత్సరం గడుస్తున్న ప్రభుత్వం రైతుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోవడం రైతులను విస్మరించారు. చక్కెర ఫ్యాక్టరీ తెరిపించేంత వరకు ప్రతియేటా సతీసమేతంగా పెద్దమ్మ తల్లికి బోనాలు తీస్తానని మొక్కుకున్న సియస్ ఆర్ ఫౌండేషన్ అధినేత చెన్నమనేని శ్రీనివాస రావు రైతులతో కలిసి పెద్దమ్మ తల్లికి బోనం తీసి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సియస్ఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం బిఆర్ యస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వంద రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీ తెరిపించకపోతే అదే గేట్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని నమ్మించి, రైతుల ఓట్లను దండుకుని గెలిచి ఏండ్లు గడుస్తున్న ఆత్మహత్య సంగతి పక్కన పెడితే ఇప్పటికీ కనీసం రైతుల పక్షాన చట్టసభల్లో చక్కెర ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన పాపాన పోలేదు.

- Advertisement -


అదే విధంగా ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపి అరవింద్ తనను గెలిపిస్తే మూసివేయబడ్డ చక్కెర ఫ్యాక్టరీనీ తెరిపిస్తానని అవసరమైతే తన సొంత ఖర్చులతోనైనా తెరిపించి రైతులకు న్యాయం చేస్తానని మాటిచ్చి చెరుకు రైతులను మోసగించాడని, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చెరుకు రైతులను ఏకీకృతం కాకుండా అడ్డుకుంటూ మొక్కుబడి పాదయాత్రలు చేస్తున్నారని రైతులను మోసగించిన పార్టీలను రైతులు క్షమించరని, రానున్న ఎన్నికల్లో మళ్లీ ఓట్ల కోసం ఏ మొహం పెట్టుకొని రైతుల దగ్గరికి వస్తారని అన్నారు. చక్కెర ఫ్యాక్టరీ తెరిచేంత వరకు రైతు ఉద్యమం ఆగదని ఈ ఎన్నికల్లో మాటిచ్చి తప్పిన వాళ్లకు తప్పకుండా బుద్ది చెప్తారని ఆయన అన్నారు. నేను బ్రతికి ఉన్నంత వరకు పెద్దమ్మ తల్లికి బోనాలు తీస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సియస్ఆర్ అభిమానులు, ముత్యంపేట్ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News