సరూర్ నగర్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణం ఇండోర్ స్టేడియంలో జరిగిన పద్మశాలి శంఖరావ సభ ఘనంగా సాగింది. ఈ సభకు శంకర్ పల్లి పద్మశాలి సంఘం నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం మాట్లాడుతూ ..రాష్ట్రంలో 26 లక్షల పద్మశాలీలు ఉన్నారని దాదాపుగా 20 కి పైగా నియోజకవర్గాలలో పద్మశాలీలు అత్యధిక ఓటు బ్యాంకును కలిగి గెలుపోటములు శాసించే నిర్ణాయక శక్తులుగా ఉంన్నారని, అటువంటి నియోజకవర్గాలను పద్మశాలీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు పద్మశాలీలను ఒక వోట్ బ్యాంకుగానే లెక్కిస్తున్నారని పద్మశాలీలకు సముచిత స్థానం, రాజకీయవాటా కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది సభ.
అన్ని రంగాలలో ముందున్న పద్మశాలీలు రాజకీయ రంగంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని జనాభా ప్రకారం రాష్ట్రంలో 10 శాతం ఉన్న పద్మశాలీలకు ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. పద్మశాలీలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని ఈ ఎన్నికల్లో 24 సీట్లు ఇవ్వాల్సిందే అని అన్ని రాజకీయ పార్టీలకు డిమాండ్ చేశారు. తమకు చట్టసభలో ప్రతినిత్యం దక్కకడం లేదని బతుకు తెరువు లేక రాష్ట్రంలో పద్మశాలీలు సోలాపూర్, సూరత్ కు వలస పోతున్నారని ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పద్మశాలి లో రాజకీయాలకు అతీతంగా సంఘటితం కావాలని అన్ని రంగాలలో శక్తిగా ఎదగాలని నేతలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ యువజన ఆర్గనైజేషన్ సెక్రటరీ గడ్డం విక్రమ్ , శంకర్ పల్లి నాయకులు ఆడెపు నర్సింలు, పల్నాటి శ్రీను ,గడ్డం నాగరాజు, మోషన్, గణేష్ ,అమృతం, సుదర్శన్, గదే హరికృష్ణ ,ఉత్తర పల్లి ప్రభాకర్ ,సురేష్ గద్దె, సుమన్ ,రాజేందర్ గద్దె ,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.