Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభBalagam actor Narsingam no more: 'బలగం' సినిమా నటుడు నర్సింగం కన్నుమూత

Balagam actor Narsingam no more: ‘బలగం’ సినిమా నటుడు నర్సింగం కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు

రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో బలగం సినిమాలో సర్పంచ్ గా పాత్ర పోషించిన నటుడు, కళాకారుడు కీసర నర్సింగం అనారోగ్యంతో మరణించాడు. నర్సింగం మంచి కళాకారుడు గ్రామాల్లో ప్రదర్శించే చిన్న చిన్న నాటకాలలో పనిచేశాడు. ఇటీవల బలగం సినిమాలో సర్పంచ్ గా తన నటనను పండించి అందరిని మెప్పించిన నర్సింగం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, మృతి చెందడం కళాభిమానులను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. అయితే గ్రామంలో తెలిసిన నర్సింగం బలగం సినిమా డైరెక్టర్ ఎల్దండి వేణు ద్వారా ప్రపంచానికి తెలిశాడు. నాగారంలో నాటకాల్లో తన నటన, గాత్రం ఎంతో గంభీరంగా ఉండే నర్సింగం గొంతు మంగళవారం మూగ బోవడంతో నాగారం గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఏదేమైనా మంచి కళాకారుణ్ణి, నటుణ్ని కోల్పోవడం బాధాకరంగా ఉందని వారి కుటుంబానికి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రగాఢ సానుభూతి తెలిపాడు ఆయనతో పాటు ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు గోపు పర్సరాములు, సర్పంచ్ బాస లావణ్య శ్రీనివాసు, బలగం సినిమా టీమ్, గ్రామ ప్రజలు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News