మాలో ఒకరం రెబెల్ గా పోటీ చేసి మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని మెజారిటీతో ఓడిస్తామని బిఆర్ఎస్ అసమ్మతి నేతలు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పద్మ భర్త ఇప్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని ఏడుపాయల వనదుర్గ భవాని గుడి ముందు తడి బట్టలతో ప్రమాణం చేశారు. దీంతో అసమ్మతి నేతలు అయిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగ నరేందర్ జీవన్రావు సర్పంచ్ రాజిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు.
తడి బట్టలతో వారు కూడా ప్రమాణం చేశారు. అనంతరం దేవేందర్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆధారాలను వనదుర్గమ్మ ముందు సమర్పించారు. దేవేందర్ రెడ్డి 10 సంవత్సరాలుగా ఏడుపాయల అమ్మవారి సొమ్ము తింటున్నారని వారు ఆరోపించారు. నియోజకవర్గంలో అనేక రకాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్ల సొమ్ము కూడబెట్టారని ఇప్పుడు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని అమ్మవారి ముందు ప్రమాణం చేయడం వారు ప్రశ్నించారు కోనాపూర్ సొసైటీకి దేవేందర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు రెండున్నర కోట్ల అవినీతి కి కలెక్టర్ సస్పెండ్ చేస్తే హైకోర్టును సంపాదించి స్టే తెచ్చుకున్నారని ఆ రెండున్నర కోట్ల సొమ్ము ఎక్కడ వెళ్ళిందో ఎవరు తేల్చుకోలేకపోయారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అసమ్మతి నియోజకవర్గ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.