Friday, September 20, 2024
HomeతెలంగాణKaloji award: కవి జయరాజ్ కి కాళోజీ అవార్డు

Kaloji award: కవి జయరాజ్ కి కాళోజీ అవార్డు

తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ఇస్తున్న అవార్డ్

రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో ప్రజా కవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు 109 వ జయంతి , తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, అధికారికంగా ప్రతి సంవత్సరం సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు కవి జయరాజ్ కి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ తో కలిసి అందించారు. ఈ సందర్భంగా భాష సంస్కృతిక శాఖ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు గ్రహీతకు కాళోజీ నారాయణరావు అవార్డుతో పాటు 1 లక్ష 116 రూపాయల చెక్కును అందించి ఘనంగా సన్మానించారు.

- Advertisement -

రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… కాళోజీ నారాయణరావు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అవార్డు ను కవి జయరాజ్ ని ఎంపిక చేయటం ఆనందంగా ఉందన్నారు. వారు సాహిత్య రంగానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు KV రమణ చారి, MLC దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ వివిధ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు జూలూరి గౌరీశంకర్, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి దీపికా రెడ్డి, భాష సంస్కృతిక అధ్యక్షులు మంత్రి శ్రీదేవి, PCCB సభ్యులు సుమిత్ర, భాష సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ సాహితీ వేత్త లు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News