సోంపు గింజలతో బరువు తగ్గుతారంటున్నారు పోషకాహారనిపుణులు. వీటిల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. వీటివల్ల ఆకలి కూడా తొందరగా వేయదు. ఇవి ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి. సమతులాహారంలో సోంపును చేర్చడంతో పాటు నిత్యం వ్యాయామాలు చేయడం వల్ల బరువు బాగా తగ్గుతారు.
సోంపు గింజలను నిత్యం ఉపయోగించడం వల్ల కూడా బరువు తగ్గుతారు. సోంపుగింజలు చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఎంతో సహకరిస్తయంటున్నారు డైటీషియన్లు. శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను సోంపు బయటకు పంపేస్తుంది. ఈ గింజల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్స్ కు చెక్ పెడతాయి. అంతేకాదు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఇవి పోగొడతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా డయాబెటిస్, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల బారిన పడతాం. ఈ సమస్యను కూడా సోంపు తగ్గిస్తుంది. గుప్పెడు సోంపు గింజలు తీసుకుని వాటిని మెత్తటి పొడిలా చేసి బేక్డ్ ఐటమ్స్ లో వాడొచ్చు. ఇది రుచిని పెంచడంతో పాటు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. కడుపులో పోట్లు వచ్చినపుడు నీళ్లల్లో సోంపు గింజలు వేసుకుని తాగితే చాలా మంచిది. మనవాళ్లల్లో ఈ అలవాటు చాలాకాలం నుంచి ఉంది. ఇది జీర్ణక్రియ బాగా అయ్యేలా సహకరిస్తుంది కూడా .
గుప్పెడు సోంపు గింజలు తీసుకుని ఒక గ్లాసుడు నీళ్లల్లో రాత్రంతా నాననివ్వాలి. ఆ నీళ్లను ఉదయం లేచిన వెంటనే తాగాలి. అలాగే సోంపు టీ కూడా బరువు తగ్గడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ టీ తయారుచేయడనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. దీన్నినిత్యం తాగితే ఆరోగ్యం పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక టేబుల్ స్పూను సోంపు గింజలను తీసుకుని ఉడుకుతున్న నీళ్లల్లో వేయాలి. ఇష్టం ఉంటే దానికి బెల్లం చేర్చి ఆ టీని తాగొచ్చు. లేదా ప్లెయిన్ గా ఉండే వేడి వేడి సోంపు నీళ్లను తాగినా మంచిదే. ఒక టేబుల్ స్పూను సోంపు గింజలు తీసుకుని వాటిని చిన్న మంటపై బాగా వేగించాలి. దాంట్లో కొద్దిగా మిశ్రీ కలిపి అన్నం తిన్నవెంటనే ఆ మిశ్రమాన్ని కొద్దిగా నోట్లో వేసుకోవాలి. ఇది ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. డెజర్టు క్రేవింగ్స్ ను సైతం బాగా తగ్గిస్తుంది. ఫ్యాట్ ను కరిగించడానికి అవసరమైన యాంటాక్సిడెంట్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు సోంపు గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. రకరకాల జబ్బుల నివారణలో కూడా సోంపు గింజలను ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా చాలామంది మౌత్ ఫ్రెష్ నర్ గా ఉపయోగించడం మనకు తెలుసు. అలాగే కర్రీస్ లోనూ, అన్నంతో చేసిన డిషెస్ లోనూ, స్వీట్లల్లోనూ సోంపును బాగా ఉపయోగిస్తుంటారు కూడా. ఆస్తమా, కడుపులో గ్యాసు సమస్య, ఇతర జీర్ణ సంబంధమైన అనారోగ్య సమస్యలకు సోంపు బాగా పనిచేస్తుంది.
ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా సోంపును ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా వాడతారు. ఇందులో ఉన్న ఎన్నో పోషకాలు బరువు తగ్గించడంలో సైతం ఎంతో ఉపయోగపడతాయి. ఆయుర్వేద వైద్యంలో సోంపుగింజలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. రకరకాల కన్కాష్కన్స్ తయారీలో వీటిని వాడతారు. హీలింగ్ స్పైస్ అని సోంపు గింజలను అంటారు. వీటిల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండడం వల్ల కడుపు నిండుగా ఉండి ఆకలి వేయదు. క్రేవింగ్స్ మనల్ని బాధించవు. తక్కువ కాలరీలు మాత్రమే తీసుకుంటాం. అలా కూడా మనం బరువు పెరగం. నిత్యం సోంపు వినియోగించడం వల్ల శరీరంలోని ఫ్యాట్ స్టోరేజ్ తగ్గి శరీరంలో విటమిన్, ఖనిజాల స్వీకరణ మెరుగుపడుతుంది. సోంపు టీ తాగడం వల్ల శరీరంలోని విషతుల్యమైన పదార్థాలు బయటకుపోతాయి. దీనివల్ల కూడా బరువు తగ్గుతాం. జీవక్రియ బాగా పనిచేయడానికి సోంపుగింజలు కిక్ స్టార్టులా పనిచేస్తాయి.
జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యకరంగా బరవు తగ్గుతాం. సోంపులో ఫాస్ఫరస్, సెలినియం,జింక్, మాంగనీస్, బేటా కెరొటినా, ల్యూటిన్, జెక్సాన్థిన్ వంటి ఎన్నో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. సోంపు టీ బరవు తగ్గిస్తుంది. వేడి నీళ్లల్లో ఒక టీస్పూను సోంపు గింజలు వేసి పది నిమిషాలు దానిపై మూతపెట్టి ఉంచాలి తప్ప నీళ్లను ఉడకబెట్టకూడదు. పది నిమిషాల తర్వాత ఆ నీళ్లను తాగొచ్చు. ఉడకబెడితే సోంపు గింజల్లోని పోషకాలన్నీ పోతాయి. ఈ టీని రోజుకు మూడుసార్లు తాగితే చాలా మంచిది. బరువు తగ్గడానికి హెల్దీ డైట్ తో పాటు వ్యాయామాలు తప్పనిసరని మాత్రం మరవొద్దు.