సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలే శరణ్యమని అంగన్వాడి టీచర్లు ఫరూఖ్ నగర్ మండలం తహసిల్దార్ కార్యాలయంలో నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…అంగన్వాడీ కేంద్రాలలో సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్న టీచర్లకు ఆయాలకు కనీస వేతనం లేక పూట గడవడం చాలా కష్టంగా మారిందని నిత్యావసర ధరలు పెరుగుతున్న వారి జీతాలు మాత్రం ప్రభుత్వం పెంచడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని, గ్రాట్యూటీ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు, ఇతర సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మొండి వైఖరి మానుకొని అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన కోరికలను తీర్చి వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.