నందవరం మండల పరిధిలోని కనకవీడు గ్రామంలో మేక పిల్లలపై కుక్కల దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనకవీడు గ్రామానికి చెందిన కురువ బతుకన్న కుమారుడు రమేష్ అనే మేకల యజమానికి చెందిన 34 మేకపిల్లలు మృతి చెందాయి. బాధితుడు తెలిపిన వివరాల మేరకు మూడు సంవత్సరాలు క్రితం 30 మేకలను తెచ్చుకొని మేకల పెంపకం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడని ఆ మేకలు పెరిగి 70 మేకలయ్యాయని ఇటీవల 20 రోజుల క్రితం 34 మేకలు ప్రసవించగా 34 పిల్లలు పుట్టాయని.. రోజు మాదిరిగే ఉదయం 70 మేకలును ఆరుబయట మేపుకొని సాయంకాలం ఇంటికి చేరుకొని వాటిని ఒక కొట్టంలోకి వదిలాడు. ఉదయం 5 గంటల సమయంలో లేచి చూసే సరికి 34 మేకపిల్లలు విగత జీవులుగ పడి ఉన్నాయని, వాటిని చూసి బోరుమంటు విలపించాడు. వాటి విలువ దాదాపు 1,50,000 రూపాయలు ఉంటుందని ..కావున ప్రభుత్వం బాధితుడిని ఆదుకోవాలని బాధితుడు కోరాడు.
