Monday, June 24, 2024
HomeఆటChagalamarri: మండల స్థాయి క్రీడా పోటీలు

Chagalamarri: మండల స్థాయి క్రీడా పోటీలు

చాగలమర్రి మండల పరిధిలోని స్కూళ్లన్నీ పాల్గొనవచ్చు

నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో 12వ తేదీ మండల స్థాయి క్రీడా పోటీలను జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోటయ్య , మండల అధ్యక్షుడు రామిశెట్టీ వీరభద్రుడు , ఉప సర్పంచ్ షేక్ సోహెల్ ఆధ్వర్యములో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ సొహెల్ మాట్లాడుతూ మన మండల పరిధిలోని వివిధ గ్రామాల క్రీడాకారులను గుర్తించి వారికి ఏ రకమైన క్రీడలలో నైపుణ్యత ఉన్నది అని పరిశీలించి వారికి జిల్లా స్థాయి లేదా రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమయ్యే సామగ్రిని వసతులను ఏర్పాటు చేయిస్తామని తెలియజేశారు.

- Advertisement -


రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో 9 క్రీడాంశాలతో క్రీడలను నిర్వహిస్తున్నామని దాదాపీర్ తెలిపారు. కబడ్డీ కోకో, త్రో బాల్, బాల్ బ్యాట్మెంటన్, వాలీబాల్, యోగ,టెన్నిస్, అండర్ 14, అండర్ 17 బాల బాలికలకు ఎంపిక నిర్వహిస్తున్నామని మండల స్కూల్ గేమ్స్ సమాఖ్య సమన్వయకర్త ఎం దాదా పీర్ తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొంటారన్నారు. ఆళ్లగడ్డ బాల సాగర్ హైస్కూల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పి .ఈ. టి జ్యోతి, మాబు హుస్సేన్ నరేష్ రెడ్డిలు, మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులు అందరూ చాగలమర్రి మండల పరిధిలో గల వివిధ పాఠశాలల నుంచి ఈ క్రీడలో పాల్గొంటున్నారని దాదా పీరు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News