డోన్ పట్టణంలోని సాంజో స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ నిషా ఫిలిప్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రత్యేకంగా హాజరైన స్పోకెన్ ఇంగ్లీష్- మోటివేషనల్ స్పీకర్ మహేష్ తనదైన శైలిలో పిల్లలతో ఆడుతూ పాడుతూ కొన్ని విషయాలు సూచించారు. అనంతరం కరెస్పాండెంట్ సిస్టర్ నిషా పిలిప్ విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖిలో
పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా అవసరమని, ముఖ్యంగా ఒక విద్యార్థితో వేరే పిల్లలను పోల్చడం చేయద్దని హెచ్చరించారు. అలా చేయడం వల్ల పిల్లలు మానసికంగా చాలా బాధపడతారని, భవిష్యత్తుల్లో పిల్లలు మొండిగా తయారయ్యేలా ఇదంతా చేస్తుందన్నారు.
Dhone: ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం
డోన్ లో జరిగిన కార్యక్రమం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES