Monday, June 24, 2024
HomeదైవంSrisailam: మల్లన్న ఆదాయం 5 కోట్ల పైమాటే

Srisailam: మల్లన్న ఆదాయం 5 కోట్ల పైమాటే

34 రోజులుగా మల్లన్నకు వచ్చిన ఆదాయం

శ్రీశైలం మల్లన్న దేవాలయంలో జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,07,46,508/- నగదు రాబడి లభించింది. కాగా ఆలయ హుండీల ఆదాయాన్ని భక్తులు గత 34 రోజులలో (11.08.2023 నుండి 13.09.2023 వరకు) సమర్పించినది మాత్రమే. ఈ హుండీలో 324 గ్రాముల 500 మిల్లీ గ్రాములు బంగారు, 10 కేజీల 050 గ్రాముల వెండి లభించాయి. 839 యుఎస్ డాలర్లు, 1115 యూఏఈ దిర్హమ్స్ 130 – యూరోప్, 100 – ఆస్ట్రేలియా డాలర్లు, 100 – మలేషియా రింగిట్స్, 85 – ఇంగ్లాండు పౌండ్స్, 10 – సింగపూర్ డాలర్లు.. 10 – ఎస్.ఏ.యు రియాల్స్, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. ఈ హుండీల లెక్కింపులో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News