టికెట్ ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ గెలుపు ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడ్చెల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్, మాజీమంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… పార్టీ టికెట్ ముఖ్యం కాదని పార్టీ గెలుపు ముఖ్యమని పేర్కొన్నారు. సేవ చేయడమే నాయకుడి లక్షణమని దోచుకోవడం కాదని అన్నారు. మార్పు తాండూర్ నుండి మొదలవుతుందని, కాంగ్రెస్ జెండా ఎగర వేయడం ఖాయమని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో…. 2018 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికలలో తప్పకుండా ఓడించడమే లక్ష్యమని తెలిపారు.
గత ఎన్నికలలో తాండూర్ ప్రజలు తప్పు చేయలేదని కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ ఫిరాయింపులు చేసి ప్రభుత్వానికి లాలుచి పడి పార్టీ మారారన్నారు. తాండూర్ ప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థిని తుక్కు తుక్కుగా ఓడించాలని అన్నారు. ఈ నెల 17న జరిగే తుక్కుగూడ సభ ద్వారా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మొదలవుతుంది కావున తాండూర్ నియోజకవర్గంలో నుండి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున సభకు తరలిరావాలని పిలుపున్నిచ్చారు. అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ కి అనుకూలం ఉన్నాయన్నారు. ఏది ఏమైనా తాండూరులో ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి ధారా సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తం చంద్, జనార్దన్ రెడ్డి, బాతుల వెంకటేశం, కౌన్సిలర్లు మమత నాగరాజు, మధుబాల భీమ్ శంకర్, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.