Sunday, December 8, 2024
Homeనేరాలు-ఘోరాలుChagalamarri: ఒక పక్క దోమలు, మరో పక్క కుక్కలు

Chagalamarri: ఒక పక్క దోమలు, మరో పక్క కుక్కలు

వ్యాధులే వ్యాధులు

అయ్యా దోమలు బాబోయ్ఈ.. మాట వింటేనే నంద్యాల జిల్లా చాగలమర్రి ప్రజలు భయపడిపోతున్నారు. ఇంటి శత్రువులుగా మారి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. చీకటి పడగానే రయ్యి మంటూ మోత మోగిస్తున్నాయి. దోమతెరలు లేనిదే నిద్రించలేని పరిస్థితి.చాగలమర్రి లోని మురుగునీటి కాలువలు దోమలకు పుట్టిళ్లుగా మారాయి. వర్షాకాలం ప్రారంభంలోనే నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలి. నిరంతరం ఫాగింగ్‌ చేయించాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. కానీ ఎక్కడా ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఫాగింగ్‌ను అటకెక్కించేశారు.

- Advertisement -

లార్వా నిర్మూలన ఎక్కడ ?

వర్షాకాలం వచ్చింది. తరచూ చినుకులు పడుతున్నాయి. వీధుల్లో చెత్త పేరుకుపోవడంతో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారవుతుంది. మురుగుకాలువలు పూడికతో నిండిపోయాయి. దీంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. దోమలు వృద్ధి చెందుతున్నాయి. వీటి దాడితో రాత్రిళ్లు పట్టణ వాసులకు నిద్ర కరవవుతుంది. వీటి నియంత్రణకు ఆదిలోనే చర్యలు తీసుకోవాల్సి ఉంది. లార్వా దశలోనే నిర్మూలించాలి. ఇందుకు కాలువల్లో గంభూషియా చేప పిల్లలు వదలాలి. ఆయిల్‌ బాల్స్‌ వేయాలి. తద్వారా మురుగుకాలువల్లో దోమలు పుట్టకుండా అరికట్టవచ్చు. మురుగు ఉన్న చోట మందు పిచికారీ చేయించాలి. వీధుల్లో ఫాగింగ్‌ సక్రమంగా నిర్వహించాలి. ఈ కార్యక్రమాలన్నీ పక్కాగా చేస్తే దోమలను పూర్తిగా నిర్మూలించవచ్చు. చాగలమర్రి గ్రామంలో ఇంత వరకు స్ప్రేయింగ్‌ మరియు ఫాగింగ్ చేయించలేదు. ఈ ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోంది.

వ్యాధులతో కలకలం..

చాగలమర్రి మండల పట్టణములో వేలాది మంది ప్రజలు నివసిస్తున్నారు. ఏటా పారిశుద్ధ్య పనులకు దాదాపు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా దోమల నివారణను అధికారులు విస్మరించారు. దీంతో పట్టణ ప్రజలు డెంగీ, మలేరియా, చికెన్ గున్యా , తదితర ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కాలువల్లో మురుగు నిల్వ ఉండి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. వీటి నివారణకు వీధుల్లో రసాయనాలతో కూడిన ఫాగింగ్‌ చేయాల్సి ఉండగా అలాంటిదెక్కడా కనిపించడం లేదు. నగరంలోని ఖాళీ స్థలాల్లో మురుగునీరు నిల్వ అవుతుంది. ఇవి దుర్వాసనతో పాటు దోమలకు ఆవాసంగా మారాయి. పట్టణంలో ఉండే ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు చేరి నిల్వ కావడంతో అధ్వాన పరిస్థితులు నెలకొంటున్నాయి. చాగలమర్రి గ్రామంలో రోడ్లు నాటికి నేటికి చాలా వరకు మారాయి అని ప్రజలు ఇబ్బంది పడకుండ ఊపిరి పీల్చుకుంటూ హర్షం వ్యక్తం చేస్తూ నాయకులను మెచ్చుకున్నారు.ఇంకా కొన్ని రోడ్లు సరిగా లేవనీ అధికారులు వాటి మీద దృష్టి సారించి వాటిని బాగు చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. చాగలమర్రి గ్రామంలో డ్రైనేజీ సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా చాగలమర్రి పట్టణంలో వేధిస్తున్న కుక్కల బెడద , దోమల బెడద , డ్రైనేజీ వ్యవస్థ అధికారులు వీటిపై దృష్టి సారించి ఈ సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కలిగించే విధంగా అధికారులు తక్షణమే నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News