ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16 వ తేదీన ప్రపంచ ఓజోన్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా అజీమ్ బ్రిలియంట్ ఉన్నత పాఠశాల కరస్పాండెట్ ఎం.యస్.అన్సర్ భాషా, ప్రధానోపాధ్యాయుడు ఎం .షబ్బీర్ అహ్మద్ , ఉపాధ్యాయులు గౌస్ లాజమ్ , నాయాబ్ రసూల్, శ్రీనివాసులు , సతీష్ కుమార్ , మహబూబ్ సాహెబ్ , ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ ఓజోన్ పొర ప్రాముఖ్యతను, దానిని పరిరక్షించడానికి మనం పాటించవలసిన జాగ్రత్తలను నినాదాల రూపంలో ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ పాఠశాల నుండి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, అందరూ కలిసి ఓజోన్ ప్రతిజ్ఞ చేశారు..
ఆస్ట్రేలియా భూభాగానికి ఎగువన వాతావరణ పరిధిలో ఓజోన్ పొర మందం దాదాపు 5-9 శాతం మేరకు తగ్గింది. దీనివల్ల అక్కడ భూమ్మీదకు అతి నీలలోహిత కిరణాలు తగినంత వడబోత లేకుండానే, నేరుగా ప్రసరించే ప్రమాదం ఏర్పడింది. ఇక్కడ ఆరుబయట ఎక్కువసేపు గడిపేవారు అతి నీలలోహిత కిరణాల రేడియేషన్‌కు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక దక్షిణ ధ్రువ ప్రాంతమైన అంటార్కిటికా వద్ద కూడా ఓజోన్ పొర తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా సెప్టెంబర్-నవంబర్ నెలల మధ్య కాలంలో ఓజోన్ పొరకు రంధ్రం మరింతగా విస్తరిస్తోంది. దక్షిణార్ధగోళంలో అక్కడక్కడా సంభవించిన భారీస్థాయి అగ్నిపర్వతాల పేలుళ్లు కూడా ఈ ప్రాంతంలో ఓజోన్ పొరకు విఘాతం కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాలుష్యాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి మనవంతు ప్రయత్నించాలని, మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పాఠశాల విద్యార్థులు కొనియాడారు. ర్యాలీ అనంతరం పాఠశాలలో విద్యార్థులచే మొక్కలు నాటించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
Chagalamarri: అజీమ్ బ్రిలియంట్ స్కూల్ లో ఓజోన్ డే
ఓజోన్ ను సంరక్షించుకుందామంటూ ప్రతిజ్ఞ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES