Friday, September 20, 2024
HomeతెలంగాణKCR: పాలమూరు గోస తీర్చిన కేసీఆర్

KCR: పాలమూరు గోస తీర్చిన కేసీఆర్

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభం

దక్షిణ తెలంగాణ వరప్రదాయని, పాలమూరు కరువు గోస తీర్చేందుకు 12:30 లక్షల ఎకరాలకు సాగు నీరు, 70 మండలాల్లోని 1226 గ్రామాలకు తాగునీరు అందించాలన్న సంకల్పంతో చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించారు.

- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని నార్లాపూర్ వద్ద పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ ను ఆవిష్కరించారు. అక్కడే కంట్రోల్ రూమ్ లో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపుకు స్విచ్ ఆన్ చేశారు.

అనంతరం కిలోమీటర్ దూరంలో ఉన్న పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సిస్టర్న్స్ దగ్గర మొదటి పంపు ద్వారా నార్లపూర్ రిజర్వాయర్ కు వెళుతున్న కృష్ణమ్మ జలాలకు పూలాభిషేకం చేశారు.అంతేకాక పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా వస్తున్న కృష్ణమ్మ జలాలను అన్ని గ్రామాలకు పంపించేందుకు ఏర్పాటుచేసిన కళశాలకు పూజ నిర్వహించి ఆ కళాశాలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్,వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,ఎం ఎల్ ఏ లు,అధికారులకు, ఇతర ప్రజాప్రతినిధులకు అందజేశారు. అనుకున్న సమయంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాజలాలను పాలమూరు లాంటి కరువు జిల్లాకు అందించడం సంతోషంగా ఉందన్నారు.

కాగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా లోని నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి ,వికారాబాద్, నల్గొండ జిల్లాలలోని 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు అందనుండగా, 70 మండలాలలోని 1226 గ్రామాలకు తాగునీరు అందనుంది. 5 లిఫ్టులు, ఆరు రిజర్వాయర్లతో 67.74 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగిన 6 రిజర్వాయర్లను నిర్మించడం జరిగింది. అంతేకాక 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో వినియోగించడం జరుగుతున్నది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటితో కరువు జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కరువుగోస తీరనుండడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్,, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,గనులు భూగర్భ జలవనలు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమారి, డిజిపి అంజనీ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ,మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కొల్లాపూర్ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి ,నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ,జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి ,కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్లు, పి ఉదయ్ కుమార్, జి రవి నాయక్ ,తేజస్ నందలాల్ పవర్, గద్వాల జిల్లా కలెక్టర్ క్రాంతి, నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు ప్రాజెక్టుల ఇంజనీర్లు ఇతర అధికారులు , ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News