Monday, November 25, 2024
HomeతెలంగాణKCR on Palamuru project: నాడు తెలంగాణ నేడు పాలమూరు ప్రాజెక్టుతో నా మనసు పులకరించింది

KCR on Palamuru project: నాడు తెలంగాణ నేడు పాలమూరు ప్రాజెక్టుతో నా మనసు పులకరించింది

తెలంగాణకు రావలసిన నీటి వాట ఎంత ఉందో తేల్చాలి

తెలంగాణ సిద్ధించిన నాడు నా మనాసు ఎంత పులకరించిపోయిందో .. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ జలాలు పైకి ఉబికి పడుతుంటే నా మనుసు అంతే పులకరించిపోయింది ,- రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు
కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణకు రావలసిన నీటి వాట ఎంత ఉందో తేల్చాలని కేంద్రానికి ముఖ్యమంత్రి డిమాండ్
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందాలి – రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు
సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని నార్లపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మొదటి మోటారు ను ముఖ్యమంత్రి కంప్యూటర్ మీట నొక్కి ప్రారంభించారు. అనంతరం పక్కనే ఇంటేక్ వద్ద జలసందర్షన మంత్రోచ్చారణ తో కృష్ణమ్మ పూజలు నిర్వహించి జలాశయంలో పూలు వదిలారు. అనంతరం సింగోటం చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

- Advertisement -


ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే హైదరాబాద్ లో అడ్డ మీది కూలీలు గా పిలిచేవారని నేడు ఇదే పాలమూరు లో పక్క రాష్ట్రాల నుండి వ్యవసాయ కూలీలుగా బతకడానికి వస్తున్నారన్నారు. తెలంగాణ వస్తె పాలమూరు జిల్లా ను కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేస్తా అని ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు మాట నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. నేను పాలమూరు పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో గోదావరి, కృష్ణ నది పై మూడు ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకుంటే తెలంగాణ వజ్రపు తునకగా మారుతుందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇదే పాలమూరు నాయకులు అనేక రకాలుగా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1975 లో బచావత్ ట్రిబ్యునల్ కు తెలంగాణ కృష్ణా జలాల నీటి వాట అడగలేదని, అయినప్పటికినీ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గ్రహించిన ట్రిబ్యునల్ న్యాయమూర్తి జూరాల ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ ని జూరాల 1981 వరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యక్తి అంజయ్య వచ్చి జూరాల ప్రారంభించారు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అలంపూర్ రాజోలి వద్ద పాదయాత్ర చేస్తున్నప్పుడు రాజోలి బండ మూసేస్తే దానిని బద్దలు కొట్టి రాయలసీమ కు నీళ్ళు తీసుకుపోతామని చెబితే బాంబులు వేసి మొత్తం పెల్చేస్తాం అని హెచ్చరించిన అని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వానికి సాగు నీరు అడిగితే కృష్ణ నది కిందికి ఉండి మీ ప్రాంతం గడ్డ మీద ఉంటే నీళ్ళు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు అన్నారు.

మరి తెలంగాణ ఏర్పడ్డాక ఈ రోజు నీళ్ళు ఎలా వస్తున్నాయని అడిగారు. కేంద్రంలో బి.జే.పి ప్రభుత్వ ఏర్పడి 10 సంవత్సరాలు అయ్యాయని, కృష్ణ జలాల్లో తెలంగాణ వాట తెల్చమని అడుగుతుంటే ఇప్పటి వరకు కృష్ణ ట్రిబ్యునల్ కు ఒక లేఖ రాయలేక పోయిందని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ను అతితక్కువ వ్యవసాయ భూమి పోయేవిధంగా డి.పి.అర్. తయారు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు ఉమ్మడి పాలమూరు జిల్లాకు 50 ఏళ్లలో ఒక్క మెడికల్ కళాశాల మంజూరు చేయలేదని, ఇప్పుడు 5 మెడికల్ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 14 నియోజకవర్గాల్లో 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే వరకు విశ్రమించేది లేదని అన్నారు. కొల్లాపూర్ నియోజక అభివృద్ధికి తక్షణ సాహాయం గా 25 కోట్లు మంజూరు చేశారు. నియోజక వర్గంలోని ప్రతి గ్రామపంచాయతీ కి 15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక పాలిటెక్నిక్ కళాశాల, చెక్ డ్యాములకు సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్లు నియోజక వర్గానికి 3 వేలకు బదులు అదనంగా మరో వెయ్యి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని తెలిపారు. మహబూబ్ నగర్ లో జే.ఎన్.టి.యు ద్వారా ఒక ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్కూల్ పిల్లలకు ప్రతి ఉదయం టిఫిన్ లు గుడ్డు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని అందుకు ప్రజల సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ బ్కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, భా.రా.స. పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ కేశవరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్, కొల్లాపూర్ శాసన సభ్యులు బీరమ్ హర్షవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, నాగర్ కర్నూల్ ఎంపి పోతుగంటి రాములు, మహబూబ్ నగర్ ఎంపి మన్నే శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి, కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్, జడ్చర్ల శాసన సభ్యులు డా. లక్ష్మ రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు ఆలా వేంకటేశ్వర రెడ్డి, అలంపూర్ శాసన సభ్యులు డా. వి.యం. అబ్రహం, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, నారాయణపేట శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి, ఎమ్మేల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, నాగర్ కర్నూల్ జడ్పి చైర్మన్ శాంతి కుమారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రెటరీ, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ కుమార్ దీపక్, డి.సి.సి.బి. డైరెక్టర్ జక్కా రఘునందన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News