Saturday, November 23, 2024
HomeతెలంగాణMallareddy: ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

Mallareddy: ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి చామాకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి ముందు జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సమాజంలో బడుగు, బలహీన, పేదల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, అమ్మఒడి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్లు, గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీ, దళిత బంధు, బీసీలకు ఆర్థిక సహాయం, గృహలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తూ అన్ని సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భావనాలను నిర్మించడమే కాక, విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం,అదేవిధంగా జిల్లాకో మెడికల్ కళాశాల వంటివి ఏర్పాటు చేస్తున్నదని అన్నారు.

- Advertisement -

మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో ఉందని,ఈ విషయంలో అధికారులు ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమూల్య నా తెలంగాణ అని, సాయుధ రైతాంగ పోరాట యోధులకు,స్వాతంత్ర సమరయోధులందరికీ జోహార్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ కుమార్,అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డి,మేడ్చల్ డి.సి.పి అంబరీష్,డి.ఆర్.వో హరిప్రియ,ప్రజాప్రతినిధులు నందారెడ్డి,మధుకర్ రెడ్డి, కొండల్ రెడ్డి,వివిధ శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News