ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని హైకోర్టు న్యాయవాది పెరుమాళ్ళ హరి సూచించారు. జై భీమ్ జై భారత్ టీమ్ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం చట్టాలు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు అని ఆయన అందరి గురించి దేశ ప్రజల ను దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగాన్ని రచించారన్నారు. అయితే కేవలం దళితులకే అని ఆయనను వేలు ఎత్తిచూపడం సరైనది కాదని ఆయన అన్నారు. ప్రత్యేకంగా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన ప్రభుత్వ కార్యాలయాలు దేనికి సమస్యపై వెళ్లిన మాటలతో ఫిర్యాదు చేయకుండా కాగితంపై సమస్యను వ్రాసి ఇచ్చి ఇచ్చినట్లుగా సంతకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. అప్పుడే మీరు ఇచ్చిన సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. సమస్యపై ఫిర్యాదు చేసినట్లుగా ఆధారాలు లేకపోతే దానిని చెత్తబుట్ట దాఖలు చేస్తారని అన్నారు. నిజమైన బాధితులు ఎవరైనా ఉంటే జై భీమ్ జై భారత్ టీం ను సంప్రదిస్తే ఉచితంగా సలహాలు సూచనలు ఇచ్చి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వారికి అండగా నిలబడతామన్నారు. వీరాపురం గ్రామంలో వీధిలైట్లు వెలగకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాగే ఉంటే రాత్రి సమయంలో వర్షం వస్తే పాములు అలాంటి విష పురుగులు తిరగడం ప్రజలను కాటేస్తున్నాయి కనుక వెంటనే వీరాపురం గ్రామంలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు జై భీమ్ జై భారత్ కన్వీనర్ పెరుమాళ్ళ కేశవులు ,కో కన్వీనర్ జై భీమ్ నాగేంద్ర , కునా ప్రసాద్ లతో పాటు యూత్ కమిటీ సభ్యులు సమతా సైనిక్ దళ్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
Kothapalli: చట్టాలపై అవగాహన పెంచుకోండి
హైకోర్టు న్యాయవాది హరి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES