Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Jagan paid visit to Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్

CM Jagan paid visit to Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్

తిరుమల శ్రీవారి సేవలో సీఎం

తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.  శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి వర్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి శ్రీ‌వారి తీర్థప్రసాదాలు, శ్రీవారి  చిత్రపటాన్ని ముఖ్యమంత్రి వర్యులకు అందచేశారు.    

- Advertisement -

      ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి, రాష్ట్ర క్రీడా సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా, తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, జేసి.డి.కె.బాలాజీ, జే ఈ ఓ వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎమ్మెల్సీ భరత్, తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు తదితరులు వున్నారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకొని ఆ తర్వాత తిరుమల నుండి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News