అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాలలో శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించిన అంగన్వాడి టీచర్లు ,హెల్పర్లు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటిని ముట్టడించి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేసేంతవరకు ఉద్యమం ఆగదని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి. అజయ్ సారథి రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి లు రేషపల్లి నవీన్, కుంట ఉపేందర్, నర్రా శ్రావణ్, కుమ్మరి కుంట్ల నాగన్న, పెరుగు కుమార్, చింత కుంట్ల వెంకన్న, వెలుగు శ్రావణ్, సమ్మెట రాజమౌళి, ఎల్లారీశ్వరీ, బిందు, లక్ష్మి నర్సమ్మ, లలిత, కీసర సౌమ్య, అండాలు, వరలక్ష్మి, కేదస్ రమేష్ పాల్గొన్నారు.