Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: కళాకారుల నుంచి దరఖాస్తులకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆహ్వానం

AP: కళాకారుల నుంచి దరఖాస్తులకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆహ్వానం

నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, 50 శాతం మంది మహిళలు, ఎస్.సి, ఎస్.టి.లు ఉన్న కళాబృందాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు

భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తరుఫున మూడు సంవత్సరాల పాటు కళాజాతాల నిర్వహణ కోసం వ్యక్తిగతంగా లేదా బృందాలుగా కళాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఆంధ్రప్రదేశ్ రీజియన్ జాయింట్ డైరక్టర్ పి.రత్నాకర్ ఓ ప్రకటనలో తెలిపారు.
పది మందికి పైగా కళాకారుల బృందం అయితే రెండువేల రూపాయలు, బృందంలో పది మంది లోపు ఉన్నట్టయితే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తాన్ని డి.డి.గా “DDO, CBC, Visakhapatnam” పేరిట విశాఖపట్నంలో చెల్లుబాటు అయ్యే విధంగా చెల్లించవలసి ఉంటుందని ఆయన తెలిపారు. దరఖాస్తులను అక్టోబర్ పదవ తేదీ సాయంత్రం ఆరు గంటల లోపు అందే విధంగా “ది జాయింట్ డైరక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, 2వ అంతస్తు, సి.జి.ఓ. కాంప్లెక్స్, ఆటోనగర్, విజయవాడ – 500007 (ఆంధ్రప్రదేశ్)” చిరునామాకు పంపాల్సి ఉంటుందని రత్నాకర్ తెలిపారు.
నక్సల్ ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ప్రాంతాల కళాకారులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే బృందంలో యాభై శాతం మంది మహిళలు (మహిళా బృందాలైనా), ఎస్.సి, ఎస్.టి. కళాకారులు ఉన్న వారికి కూడా రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉందని, అవకాశాన్ని కళాకారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు www.davp.nic.in లేదా www.cbcindia.gov.in వెబ్ సైట్ లలో నోటిఫికేషన్ ను చూడవచ్చని రత్నాకర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News