Saturday, November 23, 2024
HomeదైవంSrisailam: శ్రీశైలం గ్రామదేవతకు విశేష పూజలు

Srisailam: శ్రీశైలం గ్రామదేవతకు విశేష పూజలు

అంకాళమ్మ వారికి విశేష పూజలు

లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ వారికి అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు. ప్రతి శుక్రవారం రోజున శ్రీ అంకాళమ్మ వారికి దేవస్థానం సేవగా (సర్కారి సేవగా
ఈ విశేషపూజ జరిపించబడుతోంది. ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ వారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించారు.
కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామ దేవతగా చెప్పబడుతున్న అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగా గల రహదారికి చివరలో కుడివైపున ఉత్తర ముఖంగా ఉంది. ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. దైవశక్తి సమాజంలో ఏదో కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని తెలియజెప్పే మన విశిష్ట సంస్కృతి ఉదాత్త వైఖరికి తార్కాణంగా ఈ గ్రామదేవత ఆరాధనను పేర్కొనవచ్చు.
చతుర్భుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి.
సర్పంలో చుట్టబడిన ఢమరుకం ఉండగా, ఎడమవైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట ముకుటం గల ఈ దేవి వస్త్రాలంకురాలై కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది. కాగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ జరిపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News