బషీరాబాద్ మండల్ సర్పంచ్లు రాష్ట్ర గనుల శాఖ మంత్రివర్యులకు బషీరాబాద్ మండల్ సర్పంచులు ఘనంగా సన్మానించారు. సర్పంచులు మాట్లాడుతూ మీరు మంత్రి కావడం చాలా సంతోషకరము వీరిద్దరూ ఒకటి కావడంతో తాండూర్ కు పెద్ద కళ వచ్చింది వీరు ఇద్దరూ ఎదురులేని ఆయుధాలు మీకు తిరుగులేదన్నారు. మహేందర్ అన్న ఇటువంటి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకొని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి , సూర్య నాయక్ , నారాయణ , దేవ్ సింగ్ ,వెంకట్ రెడ్డి, చందర్ నాయక్, గోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భూగర్భ గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ గణేష్ గుప్తా, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి జన్మదినం సందర్బంగా ఆయనను కలిసిన ఎమ్మెల్యే పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శాలువ, పుష్పగుచ్ఛం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.