Urfi Javed : బాలీవుడ్ భామ ఉర్ఫీ జావేద్ బిగ్ బాస్ తో ఫేమస్ అయి అనంతరం తన చిత్ర విచిత్రమైన డ్రెస్సులతో పాపులారిటీ తెచ్చుకుంది. తన ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కప్పుకొని మిగిలిన శరీరాన్నంతా కనపడేలా ఆమె డ్రెస్సులు ఉంటాయి. ఆమె డ్రెస్సులతో ఒకపక్క బోల్డ్ బ్యూటీగా పాపులర్ అయినా మరో పక్క వివాదాల్లో కూడా ఉంటుంది.
బహిరంగ ప్రదేశాల్లో అలాంటి డ్రెస్సులు వేయొద్దని చాలా మంది ఆమెకి వార్నింగ్ ఇచ్చినా ఆమె మాత్రం నా ఇష్టం అంటూ ఇష్టమొచ్చిన డ్రెస్సులు వేస్తుంది. గత కొన్ని రోజులుగా తన డ్రెస్సులతో బాలీవుడ్ లో నిత్యం వార్తల్లో ఉంటుంది. తాజాగా మరోసారి ఉర్ఫీ జావేద్ వార్తల్లో నిలిచింది.
ఇటీవల దుబాయిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఉర్ఫీ జావేద్ హాజరైంది. ఇక్కడ ఇండియాలో చేసినట్టే ఉర్ఫీ జావేద్ అక్కడ కూడా పిచ్చి పిచ్చి బట్టలేసుకుని తిరిగింది. దుబాయిలో బహిరంగ ప్రదేశాల్లో అలాంటి డ్రెస్సులకి అనుమతి లేదు. దీంతో పలువురు ఆమెపై దుబాయ్ పోలీసులకి ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
దీంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెపై మండిపడుతున్నారు. కొంతమంది మంచి పని అయింది, అక్కడే జైలులో వేసేయండి అంటూ కామెంట్స్ చేస్తుంటే మరి కొంతమంది అక్కడికి వెళ్లి ఇండియా పరువు తీస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దుబాయ్ పోలీసులు హెచ్చరించి వదిలేసినట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికైనా మారుతుందా లేక దుబాయ్ లో సైలెంట్ గా ఉండి మళ్ళీ ఇక్కడికి రాగానే అలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్సులతో దర్శనమిస్తుందా చూడాలి.