తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి నేడు రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు సోమవారం నాటికి 15వ రోజుకు చేరుకోగా ఈ దీక్షలలో నాలుగు మండలాల జర్నలిస్టులు కూర్చున్నారు. ఈ దీక్షలకు పీసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కడుదూరి మహేందర్ రెడ్డి, ఉమ్మడి మద్దూరు మండల ప్రధాన కార్యదర్శి కొండూరు సతీష్ కుమార్ లు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు మరోసారి గుర్తుచేస్తూ ఈ ప్రాంతం ఉనికిని కాపాడుకోవడానికి చేర్యాల,కొమురవెల్లి,మద్దూర్, ధూల్మిట్ట మండలాల ప్రజలందరూ కూడా చేర్యాల ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ముక్కలు చెక్కలుగా విభజించినటువంటి ఈ ప్రాంత మండలాలను ఏకం చేస్తూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఈ దీక్షల్లో జర్నలిస్టు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన చంద్రారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి రాజు, మద్దూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బీర్కూరి ఎల్లయ్య,రేణికుంట నవీన్, అందె అశోక్,బేజాడి అంజిరెడ్డి,కర్క చంద్రారెడ్డి, అయిత నందన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉప్పల అశోక్ రాజ్, గణేష్ తివారి, మైసంపల్లి నాగరాజు, మలిపెద్ది బాలలింగం, రాళ్లబండి గురుమూర్తి, చింతల విజయ్ కుమార్, జితేందర్ రెడ్డి, ఓరుగంటి శ్రీకాంత్ రెడ్డి, తాడూరి లింగం, అత్తిన మధు, గదరాజు రాజు, జగ్గం అనిల్ కుమార్, మల్లిగారి బిక్షపతి, కుడిక్యాల బాల్ మోహన్, కొంక మహేష్, దువ్వల మల్లేష్, తాడెం వెంకటస్వామి, కర్రోళ్ల నవజీవన్, మారేళ్ళ లక్ష్మారెడ్డి, మాచర్ల ప్రశాంత్ గౌడ్, బద్దీపడగ శ్రీనివాస్ రెడ్డి, సుతారి రమేష్, జీడికంటి సుధాకర్, కాసుల కుమార్, తుమ్మలపల్లి అనిల్, మెనేపల్లి ప్రభాకర్,రాచకొండ శ్రీనివాస్, లింగం,తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షలకు జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్, జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి,జేఏసీ నాయకులు మాజీ జెడ్పిటిసి కొమ్ము నర్సింగరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఉడుముల భాస్కర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు తడక లింగం, బొమ్మ గోని అంజయ్య గౌడ్, కొంగరి వెంకట్ మావో, మిట్టపల్లి నారాయణరెడ్డి, చంద శ్రీకాంత్, పోతుగంటి ప్రసాద్, దాసరి శ్రీకాంత్, ఒగ్గు మల్లేశం, బండకింది అరుణ్ కుమార్, కొట్టే చంద్రమౌళి, పర్వతం చంద్రయ్య మద్దతు తెలిపి కూర్చున్నారు.