Tuesday, February 11, 2025
HomeతెలంగాణAnjayya Yadav: పట్టణాలను తలపించేలా పల్లెల అభివృద్ధి

Anjayya Yadav: పట్టణాలను తలపించేలా పల్లెల అభివృద్ధి

గ్రామ అభివృద్ధితో ఆదర్శం వైపు అడుగులు

పట్టణాలను తలపించేలా పల్లెల అభివృద్ధిని సాధించాయని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం మోత్కులగూడ గ్రామంలో 15 లక్షలు, 35 లక్షలతో వెంకమ్మగూడ గ్రామంలో, 88 లక్షలతో బండోనిగూడ గ్రామంలో, 55 లక్షలతో చేగూర్ గ్రామంలో,10 లక్షలతో తాళ్ల గూడ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గొల్ల కురుమలకు 166 యూనిట్ల సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రజలకు సుస్థిర పాలన అందించడం లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతుందన్నారు. ఏ ఒక్కరి ఊహకు ఉందని ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి గ్రామం ఆదర్శం వైపు అడుగులు వేస్తుందన్నారు. ప్రజల క్షేమం కోసం నిరంతరం తపించే సీఎం కేసీఆర్ కి ప్రజలు అండగా నిలవాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News