Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Gauru: మచ్చలేని నాయకుడిగా చంద్రబాబునాయుడు తిరిగి వస్తాడు

Gauru: మచ్చలేని నాయకుడిగా చంద్రబాబునాయుడు తిరిగి వస్తాడు

అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ఈ ప్రభుత్వం ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతుందని నిరసన తెలియజేశారు పాణ్యం నియోజకవర్గ ఇంచార్జి గౌరు చరితా రెడ్డి. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంచార్జి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయం ఆవరణలో కాపుల రిలే నిరాహారదీక్ష కార్యక్రమం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ మచ్చలేని నాయకుడిగా చంద్రబాబు నాయుడు తిరిగి వస్తాడని వారు ఎన్ని వాయిదాలు చేసినా గెలిచేది చంద్రబాబు అని ఆమె ప్రజలకు తెలియజేశారు. ఈ దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రిలే నిరాహార దీక్షకు పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జ్ గౌరు చరిత రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ గౌరు వెంకట రెడ్డి , నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, పాణ్యం నియోజకవర్గ టిడిపి అబ్జర్వర్ కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా ఈ దీక్షకు మద్దతు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జయరామిరెడ్డి మండల నాయకులు రమణ మూర్తి, లాయర్ బాబు, గోవింద్ రెడ్డి, నెర్వాడ అమరశింహ రెడ్డి, కొండజూటురు మాజీ సర్పంచ్ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News