ఈ నెల 30 వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన అధికారులను ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష,హౌసింగ్, రీ సర్వే, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో తదితర అంశాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్షకు ఇంటింటి సర్వే జరుగుతోందని, ఇంకా 5 సచివాలయాల్లో సర్వే పెండింగ్ ఉందన్నారు. కర్నూల్ అర్బన్, ఆలూరు రూరల్, మంత్రాలయం, కోసిగి మండలాలలో ఈ సర్వే పెండింగ్ ఉందని, వాలంటీర్లతో ఈ సర్వే పూర్తి చేయించాలని కలెక్టర్ ఎంపిడిఓ లను ఆదేశించారు… సర్వే కి సంబంధించిన పురోగతి నివేదిక ప్రతి గంటకు నా దృష్టికి తీసుకొని రావాలని కలెక్టర్ డి ఎం హెచ్ ఓ ని అదేశించారు. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో కూడా వాలంటీర్లతో సర్వే పూర్తి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 30వ తేదీ నుండి గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లీనిక్‌తో పాటు, పట్టణంలోని పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డి ఎం హెచ్ ఓని ఆదేశించారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కి సంబంధించి 54 వేల మంది విద్యార్థుల వివరాలు కన్సిస్టెంట్ రిథమ్ యాప్, స్టూడెంట్ ఇన్ఫో యాప్ ల్లో సరిపోలడం లేదని, వీటిని ప్రధానోపాధ్యాయులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది రీవెరిఫై చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్ కి సంబంధించి ఆప్షన్ 1,2 కింద జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలలో పురోగతి లేదని, ముఖ్యంగా ఆదోని, ఆస్పరి, చిప్పగిరి, కోడుమూరు మండలాలలో జీరో పురోగతి నమోదు చేస్తున్నారని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పురోగతిలో వెనుకబడి ఉన్న కోడుమూరు హౌసింగ్ ఏఈ పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే పత్తికొండ, ఓర్వకల్లు, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, కర్నూల్ అర్బన్, వెల్దుర్తి, మంత్రాలయం మండలాలు కేవలం ఒకటి మాత్రమే చేస్తే సరిపోదని పేర్కొన్నారు. ఆదోని, గోనెగండ్ల, చిప్పగిరి మండలాలలో ఇంకా సోక్ పిట్ లు మంజూరు చేయలేదని, వాటిని వెంటనే మంజూరు చేయాలని ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. గ్రౌండింగ్ కి సంబంధించి కౌతాళం మండలంలో తక్కువ పురోగతి ఉందని, పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కౌతాళం ఎంపీడీవోను కలెక్టర్ ఆదేశించారు. ‘స్వచ్ఛత హి సేవ’ కింద గ్రామాలలో శుభ్రతకి సంబంధించి అక్టోబర్ 1 వ తేది ప్రతి గ్రామంలో శ్రమదానం కార్యక్రమం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాలలో ప్రవేశించే ముందు చెత్త చెదారం ఎక్కువగా ఉందని, దానిని తీసివేసే పనులు చేయించాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని డిపిఓ కి సూచించారు. పెండింగ్ లో ఉన్న భూ హక్కు పత్రాలను త్వరితగతిన పంపిణీ చేయాలని కలెక్టర్ తహసీల్దార్ లను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ భూ హక్కు పత్రాలు పంపిణీ చేయడంలో సి.బెళగల్, ఓర్వకల్, కర్నూల్, గూడూరు మండలాలలో ఇంకా పెండింగ్ ఉన్నాయని రేపు సాయంత్రం లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత మండలాల తహసిల్దార్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్ కి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను ఆదోని, మంత్రాలయం మండలాలు సాధించడం లేదని నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత మండలాల తహసిల్దార్లను అదేశించారు. ఆర్డిఓ, సబ్ కలెక్టర్ లాగిన్లలో మ్యూటేషన్ కి సంబంధించి పెండింగ్లో ఉన్న గ్రౌండ్ వాల్యుయేషన్ పనులు త్వరితగతిన పరిశీలించి జెసి లాగిన్ కి పంపాలని తహశీల్దార్ లను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్లో డిపివో నాగరాజు నాయుడు, డీఎంహెచ్వో రామ గిడ్డయ్య, హౌసింగ్ పిడి సిద్ధలింగ మూర్తి, సర్వ శిక్ష అభియాన్ పిఓ వేణుగోపాల్, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Kurnool collector: 30వ తేదీ నుండి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ క్యాంపులు
ఆరోగ్య శాఖ ఉద్యోగులను అలర్ట్ చేసిన కలెక్టర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES