Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: కలెక్టర్ ఆఫీస్ వెళ్లాలంటే కాళ్లు ఇరగాలంతే

Kurnool: కలెక్టర్ ఆఫీస్ వెళ్లాలంటే కాళ్లు ఇరగాలంతే

వామ్మో, కుయ్యోముర్రో అంటున్న బాధితులు

ఆ కార్యాలయం జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయం అక్కడ జిల్లా సర్వోన్నత అధికారి నుంచి అటెండర్ దాకా విధులు నిర్వహిస్తుంటారు. సుమారు 38 శాఖల అధికార ఘనం అంతా అక్కడే ఉంటుంది నిత్యం వేలాది వాహనాలు, సందర్శకులతో ఆ కార్యాలయం కిటకిటలాడుతూ ఉంటుంది. వివిధ పనుల నిమిత్తం ఆ కార్యాలయానికి వచ్చేవారంతా ప్రతి రోజూ ఆ ప్రధాన గేటు నుండి రాకపోకలు సాగించాల్సిందే.
గ్రామీణ, నగర ప్రాంతానికి చెందిన వారెవరైనా జిల్లా అధికారులకు తమ కష్టాలు చెబుదామని ఆ కార్యాలయానికి రావాలంటే ప్రధాన ప్రవేశద్వారం ముందున్న ర్యాంపు దాటాల్సిందే.

- Advertisement -

ఆ గేటు ర్యాంపు దాటాలంటే కాళ్లు విరగొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ తతంగమంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగే తంతుకాదు కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉన్న ఇనుప ర్యాంపు…. ప్రతి రోజూ జిల్లా కలెక్టర్ మొదలుకొని జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, వివిధ విభాగాలకు చెందిన అధికారులు నుండి కిందిస్థాయి ఉద్యోగులు, సందర్శకులైన ఈ ప్రధాన ప్రవేశ ద్వారం గుండా రావాల్సిందే కాలినడకన వచ్చేవారైనా, మోటారు సైకిళ్లపై వచ్చేవారైనా ఆ గేటు ముందు ఉన్న ర్యాంపు వద్ద ఆదమరిచారంటే అదుపుతప్పి గేటు ముందు బోల్తా పడాల్సిందే లేదా ర్యాంపులో కాళ్ళు ఇరుక్కాపోవాల్సిందే, లేదా కాళ్ళు విరగగొట్టుకోవాల్సిందే…

కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు ముందు డ్రైనేజీ పై కప్పి ఉంచిన సుమారు 10మీటర్లు ఉండే ఇనుప ర్యాంపు పైపులపై ప్రతి రోజూ వాహనాలు తిరిగి ర్యాంపు దెబ్బతినింది వాటికి మరమ్మత్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇనుప ర్యాంపు శిధిలమైపోయి ఈ పరిస్థితి నెలకొంది. ఇనుప పైపులు మధ్య కాళ్ళు ఇరుక్కోపోయి కాలువలో పడి కాళ్లు విరగ్గొట్టుకొని తీవ్ర గాయాల పాలవుతున్నారు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే సందర్శకులు.

నిత్యం అధికారులు ఈ తంతును చూస్తున్నా ఇనుప ర్యాంపు మరమత్తుకు నోచుకోకపోవడంపై కలెక్టర్ కార్యాలయానికి వచ్చే సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక వృద్ధులు, విద్యార్థులు ఈ ప్రవేశ ద్వారపు ఇనుప ర్యాంపు దాటాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిందే…. ఇప్పటికే పలువురు అధికారులు, సందర్శకులు ఈ గుంతలో పడి తీవ్ర గాయాల పాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. పై ఘటనలు తెలుసుకున్న జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టరేట్ కార్యాలయ ప్రధాన గేటు ముందు దెబ్బతిన్న ర్యాంపును పరిశీలించి వెళ్లారు తప్ప దాని మరమ్మత్తు చర్యలు ఇంతవరకు చేపట్టలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇనుప ర్యాంపుకు మరమ్మతులు చేయించాలని సందర్శకులు, స్థానికులు, బాధితులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News