Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుGujarat: వ్యాపారి దాష్టీకం.. వ‌డ్డీ చెల్లించ‌డంలో విఫ‌ల‌మైన వ్య‌క్తి.. శిక్ష‌గా అత‌డి భార్య‌పై లైంగిక దాడి

Gujarat: వ్యాపారి దాష్టీకం.. వ‌డ్డీ చెల్లించ‌డంలో విఫ‌ల‌మైన వ్య‌క్తి.. శిక్ష‌గా అత‌డి భార్య‌పై లైంగిక దాడి

Gujarat : రోజువారి వ‌డ్డీ లెక్క‌న ఓ ఆటోడ్రైవ‌ర్ త‌న అవ‌స‌రాల నిమిత్తం వ‌డ్డీ వ్యాపారి ద‌గ్గ‌ర అప్పు తీసుకున్నాడు. కొద్ది రోజుల పాటు స‌క్ర‌మంగా వ‌డ్డీ ఇస్తూ వ‌చ్చాడు. అయితే.. ఇటీవ‌ల కొన్ని కార‌ణాల వ‌ల్ల కొద్ది రోజులుగా వ‌డ్డీ చెల్లించ‌లేక‌పోయాడు. అప్పు తీర్చేందుకు కొంత స‌మ‌యం కావాల‌ని వ‌డ్డీ వ్యాపారిని అడుగ‌గా ఇందుకు ఆ వ్యాపారి నిరాక‌రించారు. అంతేకాకుండా ఆటో డ్రైవ‌ర్ భార్య‌ను బెదిరించి ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌రిగింది.

- Advertisement -

రాజ్‌కోట్ జిల్లాలో ఓ ఆటోడ్రైవ‌ర్ త‌న కుటుంబంతో క‌లిసి నివసిస్తున్నాడు. 2021లో అజిత్ సింగ్ చావ్డా అనే వ‌డ్డీ వ్యాపారి ద‌గ్గ‌ర రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు గాను ప్ర‌తి రోజు రూ.1,500 వ‌డ్డీ చెల్లిస్తూ వ‌స్తున్నాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రి వ‌ర‌కు వ‌డ్డీ స‌క్ర‌మంగా చెల్లించాడు. ఆ త‌రువాత ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్టుముట్ట‌డంతో రోజూ వ‌డ్డీ క‌ట్ట‌లేక‌పోయాడు. దీంతో అది కొండ‌లా పేరుకుపోయింది.

దీంతో వ‌డ్డీ వ్యాపారి అజిత్ సింగ్ వ్యాపార భాగ‌స్వామి దీపక్ వగడియాగా రంగంలోకి దిగాడు. నిత్యం ఆటో డ్రైవ‌ర్ ఇంటికి వెళ్లి వారిని వేదించేవాడు. కొంత స‌మ‌యం ఇవ్వండి మొత్తం చెల్లిస్తామ‌ని ఆటోడ్రైవ‌ర్ దంప‌తులు ప్రాధేయ‌ప‌డినా విన‌లేదు. త‌ప్పుడు కేసులు పెట్టి వారిని జైలుకు పంపిస్తాన‌ని బెదిరించాడు. అంత‌టితో ఆగ‌కుండా వ‌డ్డీ చెల్లించ‌నందుకు శిక్ష‌గా ఆటోడ్రైవ‌ర్ భార్య‌పై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

రోజు రోజుకి అత‌డి వేధింపులు అధికం అవుతుండ‌డంతో బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News