Monday, November 25, 2024
Homeచిత్ర ప్రభHrithik Roshan : గర్ల్‌ఫ్రెండ్ కోసం 100 కోట్లు పెట్టి ఇల్లు కొన్న స్టార్ హీరో..?

Hrithik Roshan : గర్ల్‌ఫ్రెండ్ కోసం 100 కోట్లు పెట్టి ఇల్లు కొన్న స్టార్ హీరో..?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ క్రిష్ లాంటి సినిమాలతో మనకి కూడా దగ్గరయ్యాడు. ఇటీవల విక్రమ్ వేద సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. హృతిక్ 2000 సంవత్సరంలో సుసానే ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ 14 ఏళ్ళ తర్వాత 2014లో వీరు విడాకులు తీసుకున్నారు.

- Advertisement -

అప్పట్నుంచి హృతిక్ ఒక్కడే ఉంటున్నాడు. అయితే గత కొంతకాలంగా హృతిక్ బాలీవుడ్ మ్యుజిషియన్, నటి సబా ఆజాద్ తో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా సార్లు ఇద్దరు కలిసి పార్టీలకి, ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నారు. ఇద్దరూ కలిసి ఫొటోలకి ఫోజులు కూడా ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఈ ఇద్దరూ జంటగా వెళ్తున్నారు. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు సమాచారం.

తాజాగా హృతిక్, సబా కలిసి ఉండటానికి ముంబైలో బాగా ఖరీదైన ఏరియాలో దాదాపు 100 కోట్లు పెట్టి రెండు అపార్ట్మెంట్స్ ని తీసుకున్నట్టు సమాచారం. ఇవి చాలా లగ్జరీ అపార్ట్మెంట్స్ అని తెలుస్తుంది. ఇంత ఖర్చుపెట్టి కొని, మళ్ళీ వాటిని రీనోవేట్ చేయిస్తున్నారట. పెళ్లి కాకుండానే గర్ల్‌ఫ్రెండ్ కోసం హృతిక్ ఇంత మొత్తాన్ని ఖర్చు పెట్టాడని బాలీవుడ్ మీడియా అంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News