రాష్ట్రంలో పరిపాలన చేయడంలో జగన్ విఫలం అయ్యాడని, ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు పరిపాల కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మంత్రాలయంలో గురువారం 26వ రోజు చేస్తున్న రిలే నిరాహార దీక్షలో కౌతాళం మండలం క్లస్టర్-3 ఇన్ చార్జి వెంకటపతి రాజు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చిన్న బసప్ప ఆధ్వర్యంలో యూనిటు బూత్ ఇన్చార్జిలు అన్ని గ్రామాలు ముఖ్యమైన నాయకులు చంద్రబాబుకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కూర్చున్నారు.. ఈ కార్యక్రమంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ మచ్చలేని నాయకుడు చంద్రబాబు ఏమి తప్పు చేశారో చెప్పలేక కోర్టులో వాయిదాలు వేయడం తప్ప, కోర్టు సమయం వృధా చేయకుండా చంద్రబాబుపై పెట్టిన కేసులకు ఆధారాలు చూపించాలని సవాలు విసిరారు..
రానున్న రోజుల్లో కడిగిన ఆణిముత్యంలా చంద్రబాబు బయటకు వస్తాడని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీది అధికారం అని అన్నారు.. ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండలం కన్వీనర్ పన్నాగ వెంకటేశప్ప స్వామి, బీసీ సీనియర్ నాయకులు నాడిగేని అయ్యన్న, చిన్న భూంపల్లి నరసింహులు, అశోక్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివ మూర్తి, మైనార్టీ అధ్యక్షులు టిప్పు సుల్తాన్ , డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజానంద్, తదితరులు పాల్గొన్నారు…