Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్KTR Warangal visit: వరంగల్ లో కేటీఆర్ చేతుల మీదుగా 1,000 కోట్ల పనులు

KTR Warangal visit: వరంగల్ లో కేటీఆర్ చేతుల మీదుగా 1,000 కోట్ల పనులు

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ.. బిజీగా సుడిగాలి పర్యటన

ఓరుగల్లులో సుమారు వెయ్యి కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు మంత్రి కేటీఆర్‌. రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మాత్యులు కేటీ రామారావు మహానగర పాలక సంస్థ, ఆర్ అండ్ బి, టీఎస్ ఐఐసి, టీఎస్ ఆర్టీసీ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జిడబ్ల్యూ ఎంసీ ఆధ్వర్యంలో 26.13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 15 ఎమ్మెల్యే సీవీరాజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను, 5 లక్షలతో నిర్మించిన బస్తి దవాఖానను, 60 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన ఎన్ ఐటి జంక్షన్, జంక్షన్ లను, 9 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పోతన ట్రాన్స్ఫర్ స్టేషన్, మోడ్రన్ ల్యాండ్రోమార్ట్, స్మార్ట్ లైబ్రరీలను ప్రారంభించారు.


ఆర్ అండ్ బి ద్వారా పదికోట్ల రూపాయలతో నిర్మించిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి ప్రారంభించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను, టి ఎస్ ఐ సి ద్వారా 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఐటీ టవర్ పనులకు శంకుస్థాపన చేశారు.

మడికొండలో 500 మందికి ఉపాధి కల్పించే క్వాడ్రాన్ట్ కంపెనీని ఆయన ప్రారంభించారు 83 కోట్ల రూపాయలతో చేపడుతున్న హనుమకొండ టి ఎస్ ఆర్ టి సి బస్ స్టేషన్ పునరుద్ధరణ పనులకు, బల్దియాక్ ఆధ్వర్యంలో 322 కోట్ల రూపాయల వ్యయంతో టి యు ఎఫ్ ఐ డి సి, స్మార్ట్ సిటీ, జనరల్ ఫండ్ తదితర నిధులతో చేపట్టనున్న భద్రకాళి బండ్ సస్పెన్షన్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్, ప్లాంటోరియం పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్ అండ్ బి ద్వారా 5 కోట్ల రూపాయలతో నిర్మించే మున్నూరు కాపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మంత్రి 2 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన రంగంపేటలోని భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. 5 కోట్ల రూపాయలతో పద్మాక్షి రోడ్ వద్ద నిర్మించిన రజక భవనాన్ని మంత్రి ప్రారంభించారు అక్కడే కోటి రూపాయల వ్యయంతో బల్దియా ఆధ్వర్యంలో చేపట్టనున్న ల్యాండ్రోమార్ట్ పనులకు శంకుస్థాపన చేశారు.

ఖిలా వరంగల్ లో జరిగిన సంక్షేమ సభలో మంత్రి 15072 మందికి గృహలక్ష్మి, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, దళిత బంధు, మైనార్టీ, బిసి బందు, డబల్ బెడ్ రుమాలు, తదితర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు . అందజేశారు. నీటిపారుదల శాఖ ద్వారా 158 కోట్లతో నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎంపీ లు శ్రీమతి మలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య,
జెడ్పి చైర్మన్లు డాక్టర్ సుధీరకుమార్, గండ్ర జ్యోతి, పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే లు నన్నపనేని నరేందర్, అరురి రమేష్, చల్లా ధర్మరెడ్డి, రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ సెక్రెటరీ జయేష్ రంజన్, సిపి ఏవి రంగనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్లు పి ప్రావీణ్య, సిక్త పట్నాయక్ కుడా చైర్మన్ సుందర్ రాజన్,జిడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజవాన్ బాషా, ఉప మేయర్ శ్రీమతి రిజ్వాన శమిమ్ మసూద్, కార్పొరేటర్లు, రెవిన్యూ, బల్దియా, పబ్లిక్ హెల్త్, ఎన్ పిడిసిఎల్, ఆర్ అండ్ బి సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ మైదానానికి చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, చీఫ్ విప్,
దాస్యం వినయ్‌భాస్కర్‌, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, జెడ్పి చైర్మన్లు డాక్టర్ సుధీరకుమార్, ఎమ్మెల్యే లు నన్నపనేని నరేందర్, అరురి రమేష్, చల్లా ధర్మరెడ్డి, సిపి ఏవి రంగనాథ్, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కుడా చైర్మన్ సుందర్ రాజన్, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజవాన్ బాషా, ప్రజాప్రతినిధులు, జిల్లా పార్టీ నేతలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News