Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభVeera Simha Reddy: ఐటెం సాంగ్ రిలీజ్.. ఊరమాస్‌ స్టెప్స్‌తో బాలయ్య రచ్చ

Veera Simha Reddy: ఐటెం సాంగ్ రిలీజ్.. ఊరమాస్‌ స్టెప్స్‌తో బాలయ్య రచ్చ

- Advertisement -

Veera Simha Reddy: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతున్న చిత్రం వీరసింహారెడ్డి. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జై బాలయ్య మాస్ ఆంథెమ్‌, సుగుణ సుందరి సాంగ్స్‌ నందమూరి అభిమానులను ఉర్రూతలూగించగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ అప్‌డేట్‌ అందించారు మేకర్స్.

ఈ సారి పక్కా మాస్‌ బీట్‌తో ఫ్యాన్స్ ముందుకొచ్చిన బాలయ్య ఊరమాస్‌ స్టెప్స్‌తో బాలయ్య రచ్చ లేపాడు. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ పాటలో కూడా ఇరువురు భామలతో బాలయ్య డ్యాన్స్ అదరగొట్టాడు. మాములుగానే బాలయ్య పాటలంటే మాస్‌ కి కేరాఫ్ అడ్రస్ అన్నట్లే ఉంటాయి. కానీ ఈ పాట ఊరమాస్‌ లెవల్లో ఉంది. థమన్‌ మరోసారి తనలోని మాస్‌ యాంగిల్ బయటకు తీయగా.. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటను సాహితి చాగంటి, యామిని, రేణు కుమార్‌లు పాడారు.

ఈ పాటలో బాలయ్యతో హీరోయిన్ హానీ రోజ్, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమా ఫేమ్ చంద్రికా రవి పోటాపోటీగా చిందులేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ స్టెప్పులలో స్పష్టంగా కనిపిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్‌ కానున్న ఈ సినిమాలో శృతిహాసన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్‌, హనీ రోజ్‌, చంద్రికా రవి, పీ రవిశంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధునియా విజయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ధునియా విజయ్‌ ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News