Thursday, September 19, 2024
HomeతెలంగాణRamagundam CP: శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూద్దాం

Ramagundam CP: శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూద్దాం

యావత్ శాఖ ఉద్యోగులు ఇందులో నిమగ్నం కావాలి

రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని మంచిర్యాల జోన్ డిసిపి సుదీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్. పెద్దపల్లి జోన్ డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్ పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశంను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత రెండు నెలలలో ఫంక్షనల్ వర్టికల్స్ లో ప్రతిభ కనబరిచిన ఇద్దరు ఇన్స్పెక్టర్స్, 15 ఎస్ఐ లు, 10 ఎఎస్ఐ లు, 27 హెడ్ కానిస్టేబుల్, 76 మంది కానిస్టేబుల్ లకి రివార్డు మేళా నిర్వహించి వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో సిపి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. యూఐ కేసులు, గ్రేవ్ యూఐ లాంగ్ పెండింగ్‌లో కేసుల పరిష్కారంపై సమీక్షా, ఎస్సి/ఎస్టీ యూఐ కేసులు, ఉమెన్ ఎగైనెస్ట్ కేసులు, పోక్సో కేసుల పరిష్కారం, కన్వెన్షన్ పై సమీక్షా, ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ కేసుల, ఎన్.హెచ్.ఆర్.సి,. ఎస్.హెచ్.ఆర్.సి, మహిళా కమిషన్‌కు సంబంధించిన అప్పీల్ పిటిషన్ పెండింగ్ పై సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా సిపి రెమా రాజేశ్వరి మాట్లాడుతూ… అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విజబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని, పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణలో, పర్యవేక్షణ, క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం ఎన్నికలను ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఒకటికి రెండుసార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. పోలీసు అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిఐ లు ఎస్ఐ లు తమ పరిదిలోని పోలింగ్ స్టేషన్ లను విజిట్ చేయాలి. ఎన్నికల నిర్వహణలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని, ఎన్నికల నిర్వహణ పరికరాల తీసుకెళ్ళే రూట్ చెక్ చేసుకోవాలి. అత్యవసరం ఉన్న పోలింగ్ స్టేషన్ ప్రాంతాలలో సిసి కెమెరాల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ముందుగానే చూసుకోవాలి, ఐడి లిక్కర్, గంజాయి లపై ప్రత్యేక నిఘా ఉంచాలి. పోలీస్ స్టేషన్ ల వారిగా గంజాయి అక్రమ రవాణా, నిల్వ, అమ్మేవారు, తాగే వారి జాబితా, గుడుంబా తయారు చేసేవారు, అమ్మే వారి, గుడుంబా తయారికి వాడె బెల్లం అమ్మేవారి, రవాణా చేసే వారి జాబితా సిద్దం చేసుకోవాలన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయం తో పనిచేయాలి, అబ్కారి శాఖా వారి సమన్వయంతో సంయుక్తంగా దాడులు నిర్వహించాలి. ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో సమస్యలును సృష్టించిన వారిపై పూర్తి నిఘా మరియు వారినీ, బాడిలీ ఆఫెండర్స్ ను, రౌడీ షీటర్స్ ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో కమ్యూనికేషన్ అనేది చాల ముఖ్యం. పోల్టికల్ వైలెన్స్, దాడులు, లా అండ్ ఆర్డర్ సమస్య, గొడవలు సృష్టంచే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియో లు వైరల్ చేసే విషయాలు, చిన్న చిన్న విషయాలైన ఉన్నత అధికారులకు సమాచారం అందించాలి. పోలీస్ స్టేషన్ ల పరిదిలో ఆకస్మిక తనిఖిలు నిర్వహించాలి. ఇంటర్ స్టేట్, డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ లవద్ద సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండేలా చూడాలి చెక్ పోస్ట్ లను అధికారులు రోజు తనిఖి చేయాలి, అక్కడ ఏర్పాటు చేసిన రిజిస్టర్ లో సంతకాలు చేయాలి. సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి సుదీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్, పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్., అడిషనల్ డీసీపీ ఏఆర్ రియాజ్ హుల్ హాక్, గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు, పెద్దపల్లి ఎసిపి ఎడ్ల మహేష్, మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి, జైపూర్ ఎసిపి మోహన్, బెల్లంపల్లి ఏసిపి సదయ్య, స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్ సిఎస్ సిపి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, సైబర్ క్రైమ్ ఎసిపి రాజేష్ ఈవో నాగమణి, ఏఆర్ ఏసిపిలు సుందర్రావు, మల్లికార్జున్, ఇన్స్పెక్టర్ లు, సీఐ లు, ఆర్ఐ లు, ఎస్ఐ లు, సీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News