Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Srinivas Goud: న్యాయం, ధర్మం గెలుస్తుందని ఈ తీర్పు ద్వారా వెల్లడైంది

Srinivas Goud: న్యాయం, ధర్మం గెలుస్తుందని ఈ తీర్పు ద్వారా వెల్లడైంది

తప్పుడు మార్గంలో గెలుపు కోసం ప్రయత్నించడం దుర్మార్గం

ఎన్నటికైనా న్యాయం ధర్మం గెలుస్తుంది అనే విషయం ఈ తీర్పు ద్వారా వెల్లడైందని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాను పరిపాలించిన ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు వారి అస్తిత్వం కనుమరుగవుతుందని కుట్ర చేసి బీసీల ద్వారానే బీసీ మంత్రి నైనా తనపై కేసు వేయించారని మంత్రి పేర్కొన్నారు. మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సందడి నెలకొంది. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మంత్రి ఇంటికి చేరుకుని బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. మంత్రికి అభినందనలు తెలియచేసేందుకు వచ్చిన వారితో ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొంది. తన నివాసం వద్ద ఆయన మీడియాతో ఈ అంశంపై మాట్లాడారు.

- Advertisement -

ఎన్నికల్లో ప్రజల హృదయాలను గెలిచి ఓట్లు సాధించి విజయం కైవసం చేసుకోవాలి కానీ ఇలా అక్రమంగా కోర్టు కేసుల ద్వారా తప్పుడు మార్గంలో గెలుపు కోసం ప్రయత్నించడం దుర్మార్గం అన్నారు. కనీసం తాగు, సాగు నీళ్లు ఇవ్వని వారిని ప్రజలు చీదరించుకున్నారు. కేసిఆర్ పాలనలో అన్ని సమస్యలు తీరాయి. మహబూబ్ నగర్ ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక పోతున్నారని అన్నారు. కప్పుడు వెనకబడిన మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఓర్వలేక ఆ ఇద్దరు ప్రధాన పార్టీలో ప్రతిపక్ష నేతలు కుట్రతో కేసు వేయించారని తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన తనలాంటి నేతలు ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకుంటే ఓర్వలేక కొందరు కేసుల పేరుతో దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని చెప్పారు.గత ఐదేళ్లుగా కేసుల పేరిట సోషల్ మీడియాలోనూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు.జోగులాంబ అమ్మవారు, మన్యం కొండ స్వామి వారి అశీస్సులు మాపై ఉన్నాయని అన్నారు. తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు ఎక్కువ రోజులు నిలబడవని నేటి తీర్పు తో తేటతెల్లం అయ్యిందన్నారు. త్వరలో తనపై కుట్రలు చేసిన వారి పేర్లను ఆధారాలతో సహా వెల్లడిస్తనన్నారు. అప్పుడు వారు తప్పనిసరిగా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మహబూబ్ నగర్ నుఅభివృద్ధి చేస్తానని, సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తమకు ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News