శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు బండిఆత్మకూరు మండల కేంద్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఆరోగ్య సమస్యలును జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైద్య అధికారులకు తెలియపర్చాలని స్పెషలిస్ట్ డాక్టర్లు, కంటి వైద్యులు, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు, హృదయ సంబంధిత రోగాలు, ఆరోగ్యశ్రీ సేవలపై పలు రకాలైన వ్యాధులకు వైద్య సేవలు అందించడమే కాకుండా అన్ని రకాల మందులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రజలు వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, వాసుదేవ గుప్తా, ఎంఅర్ఓ రవికుమార్, డాక్టర్ భావన రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, మండలం వైఎస్ఆర్సిపి నాయకులు ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీపీ దేసు వెంకటరామిరెడ్డి, జేసీఎస్ మండల ఇంఛార్జి ముడి మెల పుల్లారెడ్డి, ఎం ఎల్ ఓ పార్థసారథి రెడ్డి, వైస్ ఎంపీపీలు రాగాల రమణ, మదు శేఖర్, సింగిల్ విండో చైర్మన్ భూరం శివలింగం, బోగోలు శివశంకర్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ మద్దిలేటి, సర్పంచ్ సంద్య, ఉప సర్పంచ్ అవుటాల నాగేశ్వర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్
బాబు రెడ్డి, వైద్య సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఎం ఎల్ హెచ్ పి లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Shilpa: ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు
ఉచిత వైద్య సేవలపై అవగాహన
సంబంధిత వార్తలు | RELATED ARTICLES