మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి,చైర్మన్ కొమ్మ మహేశ్వర్ రెడ్డి,ధర్మకర్త మండలి సభ్యులు ఆవిష్కరించారు.ముందుగా శ్రీ మహానందీశ్వర స్వామివారికి,శ్రీ కామేశ్వరి అమ్మవారికి ఆలయ వేద పండితులు మరియు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అలంకార మండపంలో శ్రీ కామేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానంది పుణ్యక్షేత్రంలో 15-10-2023 నుండి 23-10-2023 వరకు శతచండియాగ పూర్వక నవదుర్గాలంకార,శ్రీ చక్రార్చన,సహస్ర దీపాలంకార పూజలతో శ్రీ కామేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం శ్రీ కామేశ్వరి దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఉత్సవాలలో జరిగే యాగములో పాల్గొనే అవకాశం ప్రజలందరికీ కల్పించడం జరిగిందన్నారు.దంపతులకు ఒక రోజుకు 13.000/- వేల రూపాయల టికెట్,తో ఉదయం సుప్రభాత సేవ నుంచి రుద్రాభిషేకము,కుంకుమార్చన శ్రీ చక్ర అర్చన నవదుర్గా కలశార్చన ,చండీయాగము సాయంకాల సహస్రదీపాలంకార పూజ,అలంకార గ్రామోత్సవాలు సామూహిక కుంకుమార్చన మొదలగు కార్యములలో రాత్రి 9 గంటల వరకు స్వయంగా పాల్గొనే అవకాశము కల్పించడం జరిగిందన్నారు.చివర్లో స్వామిఅమ్మవారి శేషవస్త్రాలు,లడ్డు ప్రసాదములు పూజలో ఉంచిన వెండి డాలరు దేవస్థానము జ్ఞాపిక మొదలగునవి ఇచ్చి వేదాశీర్వచనం చేసి పంపుటకు తీర్మానించమన్నారు.ఆది పుణ్యక్షేత్రమైన మహానందిలో కేవలం నవరాత్రులలో మాత్రమే లభించే ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణ యాగఫలమును అమ్మవారి దయను పొందగలరని తెలిపారు. అలంకార వివరములు 15 వ తేదీన శ్రీ శైలపుత్రి దుర్గ , 16 న బ్రహ్మచారిణి దుర్గ , 17 శ్రీ చంద్రఘంట దుర్గ, 18 శ్రీ కూష్మాండ దుర్గ , 19 శ్రీ స్కందమాత దుర్గ , 20 శ్రీ కాత్యాయని దుర్గ, 21,శ్రీ కాళరాత్రి దుర్గ 22 శ్రీ మహాగౌరి దుర్గ 23 వ తేదీన శ్రీ సిద్ధిధాత్రి దుర్గ రూపములలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జున,బండి హేమలత,బుసగాని వెంకటేశ్వర్లు,బసిరెడ్డి రామతులసమ్మ,మామిళ్ళపల్లి అర్జున శర్మ,దేవస్థానం అధికారులు,మరియు సిబ్బంది పాల్గొన్నారు.