Sunday, December 8, 2024
Homeచిత్ర ప్రభChagalamarri: మా ఊరి సిన్మా రిలీజ్, బిజీగా సినిమా టీం

Chagalamarri: మా ఊరి సిన్మా రిలీజ్, బిజీగా సినిమా టీం

వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 12వ తేదీ మా ఊరి సిన్మా రిలీజ్ కావడంతో నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో చక్రపాణి థియేటర్లో రిలీజ్ అయింది. సినిమా చూసిన చాగలమర్రి వాసులు .. వల్లంకొండు సాయి సుదర్శన్ రావు , మధుసూధన్ రెడ్డి , నాసిర్ పఠాన్ , షేక్ అబ్దుల్లా , ఫసక్ బాలాజీ , జిలానీ , అబ్దుల్లా , అబ్దుల్ మునాఫ్ మాట్లాడుతూ ఈ చిత్రం తీయడం గొప్ప సంగతన్నారు.

- Advertisement -

పులివెందుల పట్టణం నుంచి పులివెందుల మహేష్ , హరి , ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ కీలక పాత్రల్లో నటించారని ఆయన నటన చాలా అద్భుతంగా ఉందని అన్నారు. సినిమా అనతరం చక్రపాణి థియేటర్ ఆవరణంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు , నాసిర్ పఠాన్ , మధుసూధన్ రెడ్డి , షేక్.అబ్దుల్లా , అబ్దుల్ మునాఫ్ , ఫసక్ బాలాజీ , బ్రహ్మానంద రెడ్డి , ఎస్. కె జిలానీ పాల్గొన్నారు .

మా ఊరి సిన్మా పెద్ద హిట్ అవ్వాలని అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు

  • చాగలమర్రి గ్రామంలో మా ఊరి సిన్మా రిలీజ్ అవ్వడంతో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ టీమ్ సభ్యులలో నాసీర్ పఠాన్ , మధుసుధన్ రెడ్డి సహాయ సహకారముతో వీరి ఆధ్వర్యములో నగళ్ళపాడు గ్రామంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. నాసిర్ పఠాన్ మాట్లాడుతూ పులివెందుల మహేష్ నటించిన చిత్రం మా ఊరి సిన్మా పెద్ద హిట్ కొట్టాలని ఈరోజు వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేశామన్నారు. మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల మహేష్ , హరి అన్నలు చాలా కష్టపడ్డారని చివరకి సినిమా తీసి వాళ్ళు అనుకున్న కళ నెరవేర్చారు అని ఈ చిత్రం పెద్ద హిట్ అయి అన్న వాళ్లకు మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు , నాసిర్ పఠాన్ , మధుసూధన్ రెడ్డి , ఫసక్ బాలాజీ , అబ్దుల్ మునాఫ్ , ఎస్. కె జిలానీ , వృద్ధులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News