Sunday, October 6, 2024
HomeతెలంగాణHusnabad: జోరుగా వొడితల సతీష్ ప్రచారం

Husnabad: జోరుగా వొడితల సతీష్ ప్రచారం

కారు జోరు, ప్రతిపక్ష పార్టీల బేజారు

అక్కన్నపేట మండలం అంతకపేట, చిన్నగుబ్బడి, గొల్లకుంట, గొల్లపల్లి, కేశనాయక్ తండ, చెరువుముందు తండా, ఫకీరుతండా, పంతులుతండా, కెప్టెన్ చౌడు తండా, అక్కన్నపేట గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు భారత రాష్ట్ర సమితి హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల సతీష్ కుమార్.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రజలు సతీష్ కుమార్ కు బ్రహ్మరథం పట్టారు. భారీ ర్యాలీలు, కోలాటాలు, డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. దేశంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలలో అగ్రగ్రామి, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని, కేసిఆర్ జనరంజకమైన 2023 మేనిఫెస్టో ప్రకటించారని ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని సతీష్ కుమార్ కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News