ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో విజయ దశమి సందర్భంగా శమి పారువేట వైభవంగా జరిగింది. ఉదయం శ్రీ ప్రహ్లాదవరద స్వామివారికి అమ్మవార్లకు నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారిని మంగళగిరి ప్రభలో కొలువు దీర్చి, మేళ తాళాలు డప్పు వాయిద్యాల నడుమ చెంచు కాలనీలోని జమ్మి చెట్టు (శమి వృక్షం) వద్దకు తీసుకువచ్చారు.
- Advertisement -
చెంచులు విల్లమ్ములను, అటవీ శాఖ వారి ఆయుధాలను జమ్మి చెట్టు వద్ద ఉంచి ఆయుధ పూజ శమి వృక్ష పూజ నిర్వహించారు. అర్చకులు తొలి బాణం వేయగా చెంచులు రెండు బాణాలు వేశారు.