Tuesday, February 18, 2025
HomeదైవంChagalamarri: కన్నుల పండువగా వాసవి కన్యకాపరమేశ్వరి గ్రామోత్సవం

Chagalamarri: కన్నుల పండువగా వాసవి కన్యకాపరమేశ్వరి గ్రామోత్సవం

నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో విజయదశమి సందర్భంగా అమ్మవారు శ్రీ విజయలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. శ్రీ ఆర్యవైశ్య సభ వారిచే చాగలమర్రి పట్టణం అంతా గ్రామోత్సవం నిర్వహించారు. అశేష జనవాహిని నడుమ డిజే పాటలతో నృత్యాలు చేసుకుంటూ గ్రామోత్సవం నిర్వహించారు. అందరికీ ఆకర్షణీయంగా రమణీయంగా ఎత్తుటి బొమ్మలు నృత్యం చేసుకుంటూ కనువిందుగా అలరించాయి.

- Advertisement -

చాగలమర్రి పుర వీధుల గుండా గ్రామోత్సవంలో అమ్మవారు దర్శనం ఇచ్చింది. గ్రామోత్సవంలో భాగంగా భక్తాదులు ఇంటి ఇంటి దగ్గర అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పటాకులు కాల్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్యవైశ్య సభ కమిటీ సభ్యులు, శ్రీ వాసవి యువజన సంఘం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News