Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Hyd: కేసిఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఖాయం

Hyd: కేసిఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఖాయం

కేసిఆర్ మేనిఫెస్టో పేద వర్గాలకు హత్తుకునే సూపర్ డూపర్ మేనిఫెస్టో

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమం మీద బుధవారం తన బంధువుల ఇంటికి రాగా స్థానిక మీడియా ప్రతినిధులు ఆయనతో ముచ్చటించారు. తన తల్లి మరణానంతరం మొదటి సారి బయటకు వచ్చిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలు,బిఆర్ఎస్ మేనిఫెస్టో పై ఆయన స్పందించారు.

- Advertisement -

కేసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి వేముల పేర్కొన్నారు. కేసిఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఎప్పుడో ఖాయమయ్యిందని అన్నారు. అస్తవ్యస్తమైన కరెంట్ తో తెలంగాణ ప్రజలు గోసలు పడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసిఆర్ గారు సుమారు లక్ష కోట్లతో కరెంట్ వ్యవస్థను గాడిలో పెట్టాడని తెలిపారు. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయంగా నేడు కరెంట్ సరఫరా అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కరెంట్ కష్టాల బాధలు తొలగించింది కేసిఆరే అని మంత్రి స్పష్టం చేశారు. రైతుకు రైతు బంధు,రైతు భీమా,సాగునీరు,సకాలంలో ఎరువులు ఇచ్చి,కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు బాందవుడుగా నిలిచారని కొనియాడారు. నేడు తెలంగాణలో రైతులు తన పక్క పొలం రైతుతో దిగుబడిలో పోటీపడుతున్నారని అన్నారు. కేసిఆర్ సర్కార్ రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలు చూసి వ్యవసాయ రంగ నిపుణులు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. 200రూ. ఉన్న పెన్షన్ ను 2వేలు చేసిన ఘనత కేసిఆర్ దే అని దాన్ని 5వేలకు పెంచుతామని చెప్పాడన్నారు. అట్లాగే భూమి ఉన్న వారికి రైతు భీమా యెట్లా వస్తుందో అట్లాగే తెల్ల రేషన్ కార్డులు కలిగిన భూమి లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల కేసిఆర్ భీమా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి గతంలో ఉన్న లిమిట్ ఎత్తివేసి కేసిఆర్ ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబ సభ్యులకు 6కిలోల చొప్పున దొడ్డు బియ్యం అందిస్తున్నారని రానున్న రోజుల్లో కేసిఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం అందించనున్నట్లు తెలిపారు. అర్హురాలైన పేదింటి మహిళకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకు 3వేల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. అట్లాగే కేసిఆర్ గారు పేదల వైద్య ఖర్చులు దృష్టిలో ఉచుకుని 2లక్షలు ఉన్నదాన్ని మొదలు 5 లక్షలు ఆ తర్వాత 10 లక్షలు, ఇప్పుడు 15 లక్షలకు ఆరోగ్య శ్రీ కింద పెంచారని అన్నారు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ లో అయిన 15లక్షల విలువైన ఉచిత వైద్యం పేదలకు అందుతుందని అన్నారు. కేసిఆర్ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను హత్తుకునే సూపర్ డూపర్ మేనిఫెస్టో అని అన్నారు.

కేసిఆర్ గారు తెలంగాణ బాగు కోసం తాపత్రయ పడుతుంటే బీజేపీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం కోసం అడ్డమైన నిరాధార ఆరోపణలు చేస్తూ కేసిఆర్ గారిని విమర్శించే పని పెట్టుకున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం పోరాడి, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసిఆర్ ఒక వైపు ఉంటే..ఓటు కు నోటు కేసులో పట్టపగలు నొట్ల కట్టలతో దొరికిన దొంగ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే అమెరికా పారిపోయిన బీజేపీ కిషన్ రెడ్డి మరోవైపు ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని వారికి మంచి చేసే వారు ఎవరూ.. అధికారం కోసం మోసపు హామీలతో వచ్చే వారెవరో బాగా తెలుసన్నారు. కేసిఆర్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డి ఆయన కాలిగోటికి కూడా సరిపోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ చెప్పింది చేస్తాడని ప్రజలకు నమ్మకముందని కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్,రైతు బంధు,బీమా లాంటి ఎన్నో మానవీయ కోణ పథకాలు ఆయన హామీ ఇవ్వకుండానే పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టి అమలు చేశారన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కేసిఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ విజయం ఖాయం అయ్యిందనీ మొన్నటి వరకు 25వేల మెజార్టీ వస్తుందని అనుకున్నాం కానీ కేసిఆర్ గారి మేనిఫెస్టో తర్వాత 50 వేల మెజారిటీ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. విజయం ఖాయం అయింది కానీ మెజార్టీ తేలాల్సి ఉందన్నారు.

బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నేతలు ఎంత అరిచి గీ పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనీ మంత్రి వేముల మరోమారు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News