Sunday, October 6, 2024
HomeతెలంగాణAlai Balai: తెలంగాణ సంస్కృతి-ఆచారాలు ఎంతో గొప్పవి

Alai Balai: తెలంగాణ సంస్కృతి-ఆచారాలు ఎంతో గొప్పవి

బండారు దత్తాత్రేయ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ..

తెలంగాణ ప్రాంత సంస్కృతి, ఆచారాలు ఎంతో గొప్పవని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ నిర్వహించారు. వేడుకలకు మంత్రి తలసాని ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 సంవత్సరంలో బండారు దత్తాత్రేయ ప్రారంభించిన వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుండటం అభినందనీయం అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే ఉద్దేశంతో వేడుకలను జరుపుతున్నారని తెలిపారు.

- Advertisement -

చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా విజయదశమి జరుపుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. వేడుకలకు కేవలం మన రాష్ట్రానికి చెందిన వారిని మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించడం సంతోషకరం అన్నారు. దీని వలన తెలంగాణ సంస్కృతి గురించి వారికి కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు, వివిధ రకాల వంటకాలను వడ్డించడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. మంత్రితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News