Thursday, September 19, 2024
Homeట్రేడింగ్Assam Love : నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన

Assam Love : నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన

ఆధునిక యుగంలో ప్రేమ కు అర్థం లేకుండా పోతుంది. ప్రేమ పేరుతో వంచించడం, అవసరం తీరాక వదిలించుకోవడం.. ఇలాంటి ఘటనలు రోజుకు చాలానే వెలుగుచూస్తుంటాయి. అంతెందుకు.. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో తన లివ్ ఇన్ పార్ట్ నర్ ను అఫ్తాబ్ అనే యువకుడు చంపేసి.. 35 ముక్కలుగా నరికి ఘటన దేశమంతా సంచలనం రేపింది. ప్రేమికుడంటే ఇలా ఉండాలి అనేలా.. అసోం లో ఓ ఘటన వెలుగుచూసింది. ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి ఇక లేదని తెలిసి తల్లడిల్లిపోయాడు. కలకాలం కలిసి జీవించాలన్న ఆశలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. గుండెల్ని పిండేసే అంత బాధలోనూ.. అతను చేసిన పని నెటిజన్లచేత ప్రశంసలు అందుకుంటోంది.

- Advertisement -

అసోంలోని మోరిగావ్ జిల్లాలో మోరిగావ్‌కు చెందిన బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని.. నిండు నూరేళ్లు కలిసి జీవించాలనుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రాథనా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు కన్నుమూసిందని తెలిసి.. కడసారి చూసేందుకు వెళ్లాడు. అచేతనంగా పడిఉన్న ఆమెను చూసి గుండెలవిసేలా రోధించాడు. ఆ తర్వాత ప్రాథనా కుటుంబీకుల కళ్ల ముందే ఆమె మెడలో తాళి కట్టి, నుదుటిన బొట్టుపెట్టి, మెడలో దండవేసి పెళ్లాడాడు. జీవితంలో ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని అక్కడే శపథం చేశాడు.

అక్కడున్నవారు ఆ ఫొటోలను తీసి నెట్టింట్లో పోస్ట్ చేయడంతో.. అవి వైరల్ అవుతూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. నిజమైన ప్రేమకు ఈ ఘటన నిదర్శనమని కితాబిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News