Monday, June 23, 2025
HomeతెలంగాణSidhipet: సిద్దిపేటలో 200 నామినేషన్లు

Sidhipet: సిద్దిపేటలో 200 నామినేషన్లు

ఆవేదనలో అమరవీరుల కుటుంబీకులు

తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక తెలంగాణ దళిత సంఘాల జేఏసీతో కలిసి వచ్చే ప్రజా సంఘాలతో కలిసి సిద్దిపేట నియోజకవర్గంలో సుమారు రెండు వందల నామినేషన్లు వేసి హరీష్ రావుకు బుద్ధి చెప్తామని అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రజలకు నిర్వహించిన మీడియా సమావేశంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటాలకు బదులుగా ఒక కపట నాటకం ఆడి పెట్రోల్ పోసుకున్న వ్యక్తికి అగ్గిపెట్ట దొరకలేదా అని ప్రశ్నించారు. 1386 మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించడానికి కూడా మీకు సమయం లేదా అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కుటుంబ సభ్యులు మమత సునీత లక్ష్మమ్మ ప్రేమలత లింగమ్మ, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News