Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Sirisilla: బిజెపికి భారీ షాక్

Sirisilla: బిజెపికి భారీ షాక్

కారెక్కనున్న దరువు ఎల్లన్న

బిజెపి రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న త్వరలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బిజెపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ దరువు ఎల్లన్న కమలాన్ని వీడి కారెక్కనున్నారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు,ఇల్లంతకుంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, పెద్ద లింగాపూర్ సర్పంచ్ గొడిసెల జితేందర్ గౌడ్ లు మర్యాద పూర్వకంగా కలిసి బిఆర్ఎస్ పార్టీలోకి దరువు ఎల్లన్నను ఆహ్వానించారు. త్వరలో భారీ సంఖ్యలో తన అనుచరులు బిజెపి కార్యకర్తలతో కలిసి బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు దరువు ఎల్లన్న ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News